News June 27, 2024

BRS ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరే MLAల కోసం రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే BRS నుంచి కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. మరికొందరు హస్తం గూటికి చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. పోచారం శ్రీనివాస్ కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

News June 27, 2024

కష్టాల్లో అఫ్గానిస్థాన్

image

టీ20 వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అఫ్గాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తుండటంతో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ఓపెనర్లు గుర్బాజ్(0), ఇబ్రహీం(2)తో పాటు గుల్బాదిన్(9), నబీ(0), ఖరోటే(2) తీవ్రంగా నిరాశపరిచారు. సఫారీ బౌలర్లలో జాన్‌సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు. దీంతో అఫ్గాన్ 5 ఓవర్లకు 23 పరుగులకే కీలక 5 వికెట్లు కోల్పోయింది.

News June 27, 2024

వైసీపీ MLCపై అనర్హత వేటు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: YCP ఎమ్మెల్సీ ఇందుకూరి రాజుపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండలి ఛైర్మన్, విప్‌లకు నోటీసులు జారీ చేసింది. విచారణను జులై 10కి వాయిదా వేసింది. పిటిషనర్ రాజు సతీమణి TDPలో చేరారనే కారణంతో MLCని అనర్హుడిగా ప్రకటించారని లాయర్ కోర్టుకు వివరించారు. ఆమె నిర్ణయానికి పిటిషనర్‌ను బాధ్యుణ్ని చేయడం సరికాదని వాదించారు.

News June 27, 2024

మేఘాకు రూ.12,800 కోట్ల కాంట్రాక్ట్

image

హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) భారీ కాంట్రాక్టును దక్కించుకుని, అణు ఇంధన రంగంలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలోని కైగా వద్ద 700 మెగావాట్ల కెపాసిటీ గల రెండు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (NPCIL) పిలిచిన టెండర్లలో MEIL అగ్రస్థానంలో నిలిచింది. రూ.12,800 కోట్ల ధరను కోట్ చేసి ఈ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు MEIL తెలిపింది.

News June 27, 2024

‘కల్కి’ మూవీ పబ్లిక్ టాక్

image

ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షో పూర్తయింది. ఈ మూవీకి Xలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ ఆరంభంలో సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. విజువల్స్ నెక్స్ట్ లెవల్ అని, ప్రభాస్, అమితాబ్ నటన, క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని పొగుడుతున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ స్లోగా సాగాయంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ..

News June 27, 2024

రోడ్లు సరిగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు: గడ్కరీ

image

నాణ్యమైన సేవలు అందించనప్పుడు టోల్ వసూలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారులు సరిగా లేకుంటే టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని హైవే సంస్థలకు సూచించారు. ‘మనం టోల్ వసూలుపై చాలా ఆత్రుతతో ఉన్నాం. కానీ రోడ్లు సరిగా ఉన్న చోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలు, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది’ అని తెలిపారు.

News June 27, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్

image

టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్లు. సౌతాఫ్రికా: డికాక్, హెండ్రిక్స్, మార్క్రమ్ (C), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, అన్రిచ్ నోర్ట్జే, షంసీ.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్ (C), ఖరోటీ, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫారూఖీ.

News June 27, 2024

‘కల్కి’లో దుల్కర్ సల్మాన్ మాస్ ర్యాంపేజ్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఓవర్సీస్‌లో విడుదలైంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర అదిరిపోయిందని నెటిజన్లు ఎక్స్‌లో కామెంట్లు చేస్తున్నారు. అలాగే అమితాబ్, ఆర్జీవీ పాత్రలు కూడా అదిరిపోయాయని చెబుతున్నారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం సిినిమాలో ఉందని పొగుడుతున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీకి సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

News June 27, 2024

పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్

image

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించగా.. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.

News June 27, 2024

ఎమ్మెల్సీలుగా వర్మ, ఇక్బాల్ పేర్లు ఖరారు?

image

AP: MLA కోటా MLC స్థానాలకు TDP అభ్యర్థులుగా SVSN వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీతోపాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు టాక్. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది.