News June 27, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 27, గురువారం
జ్యేష్ఠము
బ.షష్ఠి: సాయంత్రం 06:39 గంటలకు
శతభిష: ఉదయం 11:36 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 10:00-10:52, మధ్యాహ్నం 03:12-04:03 గంటల వరకు
వర్జ్యం: సాయంత్రం 05:37-07:08 వరకు

News June 27, 2024

ఫోన్లు, సిమ్‌లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు: మంత్రి స్వామి

image

AP: రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్‌లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు. ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ‘చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో లేనివాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.

News June 27, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక
* ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
* సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం: చంద్రబాబు
* వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
* వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదు: మంత్రి DBV స్వామి
* TG: ప్రభుత్వం హామీతో సమ్మె విరమించిన జూడాలు
* పార్టీనే నాకు ముఖ్యం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

News June 26, 2024

టెన్త్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇవాళ విడుదలైన టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 62.21శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 96.15శాతం ఉత్తీర్ణత అవ్వగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 30.60శాతం మంది పాస్ అయ్యారు. జూన్ 27 నుంచి జులై 1 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలి.

News June 26, 2024

‘కల్కి’లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే?

image

రేపు విడుదల కానున్న కల్కి మూవీలో ప్రభాస్ ఎంట్రీ సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్‌స్టా లైవ్‌లో తెలిపారు. సినిమాలో తన ఫేవరెట్ క్యారెక్టర్ అమితాబ్ పోషించిన అశ్వత్థామ అని చెప్పారు. మరో మూడున్నర ఏళ్లలో రెండో పార్ట్ రానుందని పేర్కొన్నారు. కల్కి క్లైమాక్స్ ప్రభాస్‌ను కూడా సర్‌ఫ్రైజ్ చేస్తుందని, చివర్లో వచ్చే పాట అందరికి ఫేవరెట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

News June 26, 2024

త్వరలో ఈ 35 రకాల మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు.. అప్డేట్ చేసుకోండి

image

భద్రతాపరమైన కారణాలు, యాప్ పనితీరును మెరుగుపరచడానికి 35 రకాల మొబైల్స్‌లో త్వరలోనే వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అందులో శాంసంగ్, మోటరోలా, హవాయి, సోనీ, ఎల్జీ, ఆపిల్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. ఆగకుండా సేవలు పొందడానికి వినియోగదారులు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సేవలు నిలిచిపోనున్న మొబైల్స్ వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.

News June 26, 2024

రషీద్ ఖాన్‌కు ఐసీసీ మందలింపు

image

బంగ్లాదేశ్‌తో మ్యాచులో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ <<13505191>>బ్యాట్<<>> విసరడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రవర్తన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని మందలించింది. అఫ్గాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్లలో పరుగుకు నిరాకరించినందుకు తోటి ప్లేయర్ కరీమ్ జనత్ వైపుగా బ్యాట్ విసిరి అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

News June 26, 2024

నాకు పార్టీనే ముఖ్యం: జీవన్ రెడ్డి

image

TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల MLA సంజయ్(BRS) కాంగ్రెస్‌లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవని, సీనియర్లకు తగిన గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ఇకపై ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో చర్చించి తీసుకుంటామని మున్షీ తెలిపారు.

News June 26, 2024

పిన్నెల్లి అరెస్టుపై ఈసీ రియాక్షన్

image

AP: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదని ఈసీ హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఎన్నికల్లో దుశ్చర్యలకు పాల్పడకుండా ఈ అరెస్టు ఓ గుణపాఠమని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఘటనకు తార్కిక ముగింపు లభించిందని పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

News June 26, 2024

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

image

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. డోడా జిల్లాలో ముష్కరుల కదలికలపై సమాచారం రావడంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టాయి. ఈక్రమంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోనూ ఏరివేత ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరిగినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.