News June 26, 2024

సరికొత్త గరిష్ఠాలను తాకి లాభాలతో ముగిశాయి!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సెషన్‌‌ను లాభాలతో ముగించాయి. గరిష్ఠంగా 78,759 మార్క్ తాకిన సెన్సెక్స్ 620 పాయింట్ల లాభంతో 78,674 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 23,877 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 4.39% పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. దీంతో పాటు ICICI, కొటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.

News June 26, 2024

‘నరరూప రాక్షసుడు’ నీలాగే ఉండేవాడేమో!

image

ప్రేయసి పవిత్రగౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హతమార్చిన విషయం తెలిసిందే. కాగా ఆ మృతదేహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మర్మాంగాలతో పాటు చెవులు, దవడ కోసేసి ఉన్న ఆ డెడ్‌బాడీ ఫొటోలను చూడడానికే నెటిజన్లు భయపడుతున్నారు. ‘అంత క్రూరంగా చంపేందుకు మనసెలా ఒప్పింది? నరరూప రాక్షసుడు అనేవాడు నీలాగే ఉండేవాడేమో’ అని దర్శన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News June 26, 2024

తొందర పడకండి: MLAలతో కేసీఆర్

image

TG: ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో BRS MLAలతో మాజీ CM KCR భేటీ అయ్యారు. ఇటీవల పలువురు MLAలు పార్టీ మారడంతో నేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు MLAలతో సమావేశం కాగా, ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని MLAలకు కేసీఆర్ సూచించారు.

News June 26, 2024

ఎట్టకేలకు అసాంజేకు స్వేచ్ఛ

image

వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. గూఢచర్య ఆరోపణలతో సుదీర్ఘ కాలం జైల్లో మగ్గిన ఆయన మరియానా దీవుల్లోని అమెరికా కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. జర్నలిస్టుగా తనకున్న హక్కులపై నమ్మకంతోనే రహస్యాలను తెలుసుకోవాలనుకున్నట్లు తెలిపారు. అసాంజేకు 62 నెలల శిక్ష విధించిన కోర్టు, ఇప్పటికే ఆ శిక్షను అనుభవించారు కాబట్టి స్వేచ్ఛగా స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చని తీర్పునిచ్చింది.

News June 26, 2024

దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలి: వాకాటి కరుణ

image

TG: ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉన్నత విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. ప్రవేశాల్లో దివ్యాంగుల గరిష్ఠ వయోపరిమితిలో 5 ఏళ్లు సడలింపులు ఇవ్వాలని సూచించారు.

News June 26, 2024

స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ని ఖండించడం సంతోషకరం: మోదీ

image

లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా ‘ఎమర్జెన్సీ’ని ఖండించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎమర్జెన్సీ సమయంలో చేసిన అతిక్రమణలను ఎత్తిచూపినందుకు, ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన తీరును ప్రస్తావించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ రోజుల్లో బాధపడ్డ వారందరి గౌరవార్థం మనందరం సభలో స్మరించుకోవడం అద్భుతమైన సన్నివేశం. ‘ఎమర్జెన్సీ’ గురించి నేటి యువత తెలుసుకోవడం ముఖ్యం’ అని మోదీ అన్నారు.

News June 26, 2024

ఒవైసీని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతికి లేఖ

image

హైదరాబాద్ MP అసదుద్దీన్ ఒవైసీ ‘జై పాలస్తీనా’ అని నినదించడంపై న్యాయవాది హరి శంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. పాలస్తీనాకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పిన ఓ MP ఇతర దేశానికి విధేయతగా ఉన్నట్లయితే అతడిని అనర్హుడిగా ప్రకటించేందుకు ఆర్టికల్ 102లోని క్లాజ్ 1(D) అధికారం ఇచ్చినట్లు తెలిపారు.

News June 26, 2024

T20ల్లో నం.1 బ్యాటర్‌గా హెడ్.. రెండులో సూర్య

image

ఆస్ట్రేలియా హిట్టింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ICC T20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎగబాకారు. ఆ స్థానంలోని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ రెండో స్థానానికి పడిపోయారు. హెడ్‌కు 844 పాయింట్లు ఉండగా సూర్యకు 842 పాయింట్లున్నాయి. 3వ స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(816) ఉంటే 4, 5వ స్థానాల్లో బాబర్(755), రిజ్వాన్(746) ఉన్నారు. 6వ స్థానంలో బట్లర్(716), 7లో జైస్వాల్(672), 8లో మార్క్రమ్(659) ఉన్నారు.

News June 26, 2024

ఆ ఇన్నింగ్సుతో వారి నోర్లు మూయించాడు: గిల్‌క్రిస్ట్

image

T20 WC సూపర్-8లో ఆస్ట్రేలియాపై విధ్వంసకర ఇన్నింగ్సుతో రోహిత్ చాలామంది నోర్లు మూయించాడని ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ అన్నారు. IPL, లీగ్ దశలో హిట్ మ్యాన్ ప్రదర్శనపై వచ్చిన విమర్శలకు అతని బ్యాటింగ్ సమాధానంగా నిలిచిందన్నారు. కెప్టెన్ ముందుండి ఇలాంటి ప్రదర్శన చేస్తే మిగతా ఆటగాళ్లు స్ఫూర్తి పొందుతారని చెప్పారు. ఈ మ్యాచులో కంగారులను చిత్తు చేసి టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

News June 26, 2024

ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. కేంద్రానికి ₹11వేలకోట్ల రెవెన్యూ

image

కేంద్రం నిన్న ప్రారంభించిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈరోజు ముగిసింది. ఏడు రౌండ్లు జరగగా భారతీ ఎయిర్‌టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz, 2100 MHz బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 800 MHz, 2500 MHz, 26 GHz, 3.3 GHz బ్యాండ్లపై ఎవరూ ఆసక్తి కనబరచలేదని తెలిపాయి. కాగా ఈ ఆక్షన్ ద్వారా కేంద్రానికి ₹11,300కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.