News June 26, 2024

‘భారతీయుడు’ను అందుకే 2 పార్టులుగా తీస్తున్నాం: శంకర్

image

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ డైరెక్షన్లో వచ్చే నెల 12న రానున్న సినిమా ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా వస్తున్న 2 సీక్వెల్స్‌లో ఇది మొదటిది. దీన్ని 2 భాగాలుగా తీయడం వెనుక కారణాన్ని శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీక్వెల్‌‌ను ఒక పార్ట్‌గానే తీయాలనుకున్నాం. షూటింగ్ పూర్తయ్యాక చూస్తే ప్రతి సీన్ అద్భుతంగానే ఉంది. ఏ సీన్‌నూ తొలగించలేం. అందుకే 2 పార్టులుగా తెస్తున్నాం’ అని చెప్పారు.

News June 26, 2024

వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదు: మంత్రి కీలక వ్యాఖ్యలు

image

APలో వాలంటీర్ల వ్యవస్థను తాము రద్దు చేయలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఉన్న ఉద్యోగులతో జులై 1న ఇంటింటికీ నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా ఆయన సచివాలయం 3వ బ్లాక్‌లో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అటు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాలంటీర్ల కొనసాగింపుపై సందేహాలు నెలకొన్నాయి.

News June 26, 2024

రిషి సునాక్‌కు పోటీగా ‘కౌంట్ బిన్‌ఫేస్’

image

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు పోటీగా ‘కౌంట్ బిన్‌ఫేస్’ పేరుతో కమెడియన్ జొనాథన్ డేవిడ్ బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. విచిత్ర వేషధారణతో రాజకీయ నేతలపై విమర్శలు చేసే ‘కౌంట్ బిన్‌ఫేస్’ సునాక్‌కు గట్టి పోటీ ఇస్తారని టాక్. ఓ సర్వేలో సునాక్‌‌కు బిన్‌ఫేస్ కంటే 4% మాత్రమే ఎక్కువ ఆదరణ ఉందని తేలింది. యూకేలో ఐరోపా దేశాలు భాగం కావాలనేది తన కల అని జొనాథన్ చెబుతున్నారు. కాగా బ్రిటన్ 2020లో EU నుంచి తప్పుకుంది.

News June 26, 2024

ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీలు భేటీ

image

ప్రధాని మోదీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో టీడీపీ ఎంపీలు కలిశారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తర్వాత 16 మంది ఎంపీలు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై మోదీతో వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 26, 2024

పోచారం, సంజయ్‌లను అనర్హులుగా ప్రకటించాలి: జగదీశ్‌రెడ్డి

image

TG: BRS టికెట్‌పై MLAలుగా గెలిచి ఇటీవల కాంగ్రెస్‌లోకి వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్‌కుమార్‌లను అనర్హులుగా ప్రకటించాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్, పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యతిరేకంగా ఉన్నారని, ఫిరాయింపుల గురించి ఆ పార్టీ ‘పాంచ్ న్యాయ్’లోనూ ఉందని ఆయన గుర్తు చేశారు.

News June 26, 2024

BIG ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉ.8.30 వరకు ADB, ASF, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, WGL, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, HYD, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయంది.

News June 26, 2024

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

image

అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ ఇంకా 3G నెట్‌వర్క్ అందుబాటులో ఉండగా 30GB డాటా కోసం 1200 AFNలు చెల్లించాల్సిందే. నిన్న ఆస్ట్రేలియాపై అఫ్గాన్ టీమ్ గెలుపొందడంతో ఆ దేశ రాజధాని కాబూల్‌ నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్న ఫొటోలు వైరలయ్యాయి. వాటిలో ఉన్న ఇంటర్నెట్ ఛార్జీల ప్రకటనతో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఇండియాలోనే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు.

News June 26, 2024

కుల, జనాభా గణనను వెంటనే ప్రారంభించండి: సీఎం స్టాలిన్

image

దేశంలోని ప్రతి పౌరుడికి విద్య, ఆర్థిక, ఉపాధిలో సమాన హక్కులు & సమాన అవకాశాలు కల్పించేందుకు కుల గణన తప్పనిసరి అని తమిళనాడు అసెంబ్లీ అభిప్రాయపడింది. ఈక్రమంలో సీఎం స్టాలిన్ దీనికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో మూవ్ చేశారు. ఈసారి కుల ఆధారిత జనాభా గణనతో పాటు 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న జనాభా గణన పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

News June 26, 2024

విపక్షాల ఆందోళన.. సభ వాయిదా

image

లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

News June 26, 2024

జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే: మంత్రి పయ్యావుల

image

AP: మాజీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా పొందే అవకాశం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ‘మొత్తం సభ్యుల్లో పదో వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారు. 1984లో రాజ్యసభ ఎంపీ ఉపేందర్‌, 1994లో జనార్దన్ రెడ్డిలకు ప్రతిపక్ష హోదా కాదు.. ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉంది’ అని వివరించారు.