News June 26, 2024

త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ ప్లాన్?

image

నెట్‌ఫ్లిక్స్‌ త్వరలో ఓ ఉచిత ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కంటెంట్ చూడొచ్చు. అయితే వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. ఆసియా, ఐరోపా మార్కెట్లలో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్లాన్‌ను తీసుకురావొచ్చని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. భారత్‌లో తీసుకురావడంపై సంస్థ స్పష్టతనివ్వనప్పటికీ ప్రయోగాత్మకంగా పరిశీలించొచ్చని సమాచారం.

News June 26, 2024

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. టీ20 ప్రపంచ కప్‌ ఒక ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఆయన నిలిచారు. ఈ ఎడిషన్‌లో అర్ష్‌దీప్ 15 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆర్పీ సింగ్ (12) రికార్డును ఆయన అధిగమించారు. కాగా 2007 టీ వరల్డ్ కప్‌లో ఆర్పీ సింగ్ 12 వికెట్లు పడగొట్టారు. ఆ ఏడాది ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.

News June 26, 2024

పారాసెటమాల్ సహా పలు ఔషధాల్లో నాణ్యతాలోపం: CDSCO

image

విస్తృతంగా వాడుకలో ఉన్న పారాసెటమాల్, పాంటోప్రజోల్ సహా 50 రకాల ఔషధాల నాణ్యత ఘోరంగా ఉన్నట్లు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ(CDSCO) గుర్తించింది. వీటిలో 22 రకాలు హిమాచల్‌లో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది. జైపూర్, హైదరాబాద్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించినట్లు వెల్లడించింది. ఆ ఔషధాలను మార్కెట్‌ నుంచి తప్పించి, తయారీ సంస్థలకు నోటీసులిస్తామని అధికారులు పేర్కొన్నారు.

News June 26, 2024

అఫ్గానిస్థాన్‌ను ఓడిస్తే కప్ సౌతాఫ్రికాదే: హాగ్

image

సెమీస్‌లో అఫ్గాన్‌ను ఓడిస్తే T20 WC ట్రోఫీ ఇక దక్షిణాఫ్రికాదేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. ‘మార్క్రమ్‌ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా బాగా ఆడుతోంది. హెండ్రిక్స్, క్లాసెన్‌, షమ్సీ, మహరాజ్‌ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆ జట్టుకు ఉన్నారు. ఒత్తిడిని తట్టుకుంటే విజయం వారిదే’ అని విశ్లేషించారు. అఫ్గాన్, సౌతాఫ్రికాకు మధ్య ట్రినిడాడ్‌లో రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం సెమీ ఫైనల్ జరగనుంది.

News June 26, 2024

జూన్ 26: చరిత్రలో ఈ రోజు

image

1980: దివంగత సినీనటుడు ఉదయ్ కిరణ్ జననం
1874: భారతదేశంలో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ జననం
1838: నవలా రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే జననం
ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం

News June 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 26, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 26, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:44 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 26, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 26, బుధవారం
జ్యేష్ఠము
బ.పంచమి: ఉదయం 08:55 గంటలకు
ధనిష్ఠ: మధ్యాహ్నం 01:05 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:44-12:36 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 07:50-09:20 వరకు

News June 26, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక
* ఎంపీలు హాజరుకావాలని ఆయా పార్టీలు విప్‌లు జారీ
* AP: వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల: CBN
* ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు వైసీపీ చీఫ్ జగన్ లేఖ
* వైసీపీ ఎంపీలు పార్టీని వీడరు: అవినాశ్ రెడ్డి
* TG ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జులై 4కు వాయిదా
* పార్టీని వీడిన వారితో నష్టమేమి లేదు: KCR
* T20WC: సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్