News June 25, 2024

బైడెన్‌ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని మాజీ అధ్యక్షుడు
ట్రంప్ డిమాండ్ చేశారు. తాను కూడా టెస్టుకు సిద్ధమని తెలిపారు. త్వరలో అట్లాంటాలో వారిద్దరికీ మధ్య జరిగే డిబేట్‌లో క్రియాశీలంగా పాల్గొనేందుకు బైడెన్‌ కొన్ని రకాలైన ఇంజెక్షన్లను తీసుకోనున్నారంటూ అమెరికా మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ వార్తలు నిజం కాకపోతే బైడెన్ టెస్టులు చేయించుకోవాలంటూ ట్రంప్ సవాల్ విసిరారు.

News June 25, 2024

రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాల్లో వానలు కురుస్తాయంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News June 25, 2024

అఫ్గాన్ క్రికెట్ ఎదుగుదల వెనుక భారత్

image

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రయాణంలో భారత్ అడుగడుగునా అండగా నిలిచి తోడ్పడింది. 2014లో ఆ దేశ క్రికెట్ అభివృద్ధి కోసం మిలియన్ డాలర్లను కేటాయించింది. ఐసీసీలో అఫ్గాన్‌కు అసోసియేట్‌ టీమ్‌గా సభ్యత్వం దక్కేందుకు, కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి మూలకారణం ఇండియానే. గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్‌, లక్నో స్టేడియాలను వారికి హోం గ్రౌండ్‌గా ఇచ్చింది. ఇక ఐపీఎల్‌లోనూ అఫ్గాన్ ఆటగాళ్లకు అవకాశాలను కల్పించింది.

News June 25, 2024

రాష్ట్రంలో చిరుత దాడిలో మహిళ మృతి

image

AP: ప్రకాశం జిల్లాలో కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మహిళపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. నంద్యాల-గిద్దలూరు మార్గంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని పచ్చకర్లకు చెందిన మెహరున్నీసాగా గుర్తించారు. చిరుత కలకలంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

News June 25, 2024

ఎమర్జెన్సీ టైమ్‌లో వివిధ వేషధారణల్లో మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఆయన వివిధ వేషధారణల్లో ప్రజాక్షేత్రంలో తిరిగేవారట. చాలా కాలం కాషాయ వేషధారణలో స్వామీజీగా, తలపాగా ధరించిన సిక్కు వ్యక్తిగా ఆయన అవతారమెత్తారట. ఈ గెటప్‌లో ఆయన సన్నిహితులు సైతం గుర్తించలేకపోయారని ‘మోదీ ఆర్కైవ్’ ట్వీట్ చేయగా.. దీనిని మోదీ షేర్ చేశారు.

News June 25, 2024

అది కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం: TMC

image

లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ చేయడం కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయమని TMC ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ తమను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్‌కు TMC మద్దతు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభలో రాహుల్, అభిషేక్ మాట్లాడుకున్న ఫొటో నెట్టింట వైరలైంది. దీంతో స్పీకర్ ఎన్నికలో సహకరించాలని TMCని రాహుల్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

News June 25, 2024

జగన్.. ఇంకా పదవి కాంక్ష తీరలేదా?: బుద్ధా వెంకన్న

image

AP: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని YS జగన్ రాసిన <<13506565>>లేఖపై <<>>TDP నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘TDPకి 23 మంది MLAలు ఉన్నప్పుడు నలుగురిని లాక్కుని, ఇంకో ఇద్దరి లాక్కుని CBNకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాం అనుకున్నది నువ్వు కాదా? ఒక్కసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కొని ఈ లేఖ రాయాల్సింది. ఇంకా నీకు పదవి కాంక్ష తీరలేదా? మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మేం కాదు. ప్రజలు’ అని లేఖలో బుద్ధా పేర్కొన్నారు.

News June 25, 2024

ఎంపీలో మంత్రులు ఇకపై పన్ను కట్టాల్సిందే!

image

మధ్యప్రదేశ్ కేబినెట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఇకపై వారి వారి ఆదాయపు పన్నును వారే చెల్లించాలని నిర్ణయించింది. గడచిన 52 ఏళ్లుగా అక్కడి మంత్రుల పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆ సంప్రదాయానికి ముగింపు పలకాలని మంత్రి కైలాశ్ విజయ వర్గీయ తాజాగా కేబినెట్ భేటీలో ప్రతిపాదించారు. సీఎం మోహన్ యాదవ్ దాన్ని సమర్థించగా అటు మంత్రులందరూ సుముఖత వ్యక్తం చేశారు.

News June 25, 2024

ఎంపీలకు బీజేపీ త్రీ లైన్ విప్ జారీ

image

రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉండటంతో పార్టీ ఎంపీలందరూ తప్పక హాజరుకావాలని బీజేపీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. కాగా NDA నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కె.సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. రేపు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

News June 25, 2024

రాజధాని కోసం డ్వాక్రా మహిళల రూ.4.50 కోట్ల విరాళం

image

AP: అమరావతి నిర్మాణం కోసం చిత్తూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.4.5 కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు. ఆ చెక్కును సీఎం చంద్రబాబుకు ఈరోజు అందజేశారు. పాతికేళ్ల క్రితం డ్వాక్రా మహిళల కోసం చంద్రబాబు వేసిన విత్తనమే నేడు మహావృ‌క్షమై లక్షలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ విశ్వాసంతోనే అమరావతి నిర్మాణం కోసం ఉడతాభక్తిగా విరాళాన్ని కలెక్ట్ చేసి అందజేశామని వారు వెల్లడించారు.