News June 25, 2024

పుణే పోర్షె కేసు.. నిందితుడి విడుదలకు హైకోర్టు ఆదేశం

image

పుణే పోర్షె కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మైనర్ అయిన నిందితుడికి రిమాండ్ విధించడాన్ని తప్పుపట్టిన కోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రిమాండ్ చట్టవిరుద్ధమని ధర్మాసనం తెలిపింది. యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరమే అయినా మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచడం సరికాదని పేర్కొంది. ఈ కేసులో నిందితుడి తల్లిదండ్రులు, తాత సైతం జైలులో ఉండటంతో అతని సంరక్షణ బాధ్యతలను మేనత్తకు అప్పగించింది.

News June 25, 2024

మా ఎంపీలు పార్టీని వీడే అవకాశం లేదు: MP అవినాశ్

image

AP: YCP ఎంపీలు పార్టీ మారుతారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. తమ ఎంపీలు పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నీతులు చెబుతూనే దాడులను ప్రోత్సహిస్తున్నారని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తాము ఎవరిపై దాడులు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని అన్నారు.

News June 25, 2024

ట్రోఫీ గెలిచిన రాత్రి ఇంకా గుర్తుంది: సచిన్

image

టీమ్ఇండియా తొలి ప్రపంచకప్ గెలిచి నేటికి 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘41 ఏళ్ల క్రితం జరిగినప్పటికీ ట్రోఫీ గెలుపొందిన రోజు రాత్రి నాకు ఇంకా గుర్తుంది. 1983 WCను IND గెలిచినప్పుడు నా భవనం పరిసరాల్లోని దృశ్యాలు నమ్మశక్యం కానివి. వీధుల్లో ప్రజలు నృత్యాలు చేస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

News June 25, 2024

టెట్‌లో అర్హత సాధించని వారికి మరో ఛాన్స్: లోకేశ్

image

AP: టెట్ పరీక్షలో 58.4శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి లోకేశ్ ఫలితాల విడుదల అనంతరం తెలిపారు. ‘ఈ టెట్‌లో క్వాలిఫై కాని అభ్యర్థులకు మరోసారి టెట్ నిర్వహిస్తాం. కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తైన వారికి టెట్‌లో అవకాశం కల్పిస్తాం. టెట్ తర్వాత మెగా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని మంత్రి ప్రకటించారు. టెట్ ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News June 25, 2024

ఎంపీలుగా తెలంగాణ నేతల ప్రమాణం

image

లోక్‌సభ ఎంపీలుగా TG కాంగ్రెస్, BJP నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చివర్లో ఈటల రాజేందర్ జై సమ్మక్క-సారలమ్మ అని నినదించారు. చేతిలో రాజ్యాంగ పట్టుకొని ఎంపీగా ప్రమాణం చేసిన మల్లు రవి ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ స్లోగన్ ఇచ్చారు. డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, గోడం నగేశ్, సురేశ్ షెట్కార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, రఘురాం రెడ్డి ప్రమాణం చేశారు.

News June 25, 2024

BREAKING: AP TET ఫలితాలు విడుదల

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27-మార్చి 6 వరకు జరిగిన ఈ పరీక్షలో దాదాపు 2.3లక్షల మంది హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ వల్ల అది సాధ్యపడలేదు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News June 25, 2024

రూపే కార్డులదే హవా!

image

డెబిట్ కార్డు మార్కెట్‌లో భారత్‌కు చెందిన రూపే కార్డులదే 69% వాటా (2023) అని ‘ఫిబెనాచీ ఎక్స్’ సంస్థ వెల్లడించింది. కేంద్రం ప్రోత్సాహంతో రూపేలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫోరెక్స్ కార్డులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. జన్‌ధన్ ఖాతాలు ఉన్న వారికి రూపే డెబిట్ కార్డులు మంజూరు చేయడం, UPIకి రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునే సదుపాయం ఉండటంతో దీనికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపింది.

News June 25, 2024

కేజ్రీవాల్‌కు షాక్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై రికార్డులను పరిశీలించకుండా ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది. దీంతో లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం తిహార్ జైలులోనే ఉండనున్నారు.

News June 25, 2024

మోదీ అహంకారం ప్రదర్శిస్తూనే ఉన్నారు: ఖర్గే

image

దేశంలోని సమస్యలపై స్పందించకుండా PM మోదీ అహంకారం చూపుతున్నారని INC చీఫ్ ఖర్గే అన్నారు. ‘మీరు 50ఏళ్ల నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు. కానీ గత 10ఏళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ గురించి మర్చిపోయారు’ అని అన్నారు. నైతికంగా ప్రజలు ఓడించినా మోదీకి అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. NEET అవకతవకలు, ట్రైన్ యాక్సిడెంట్లు, మణిపుర్ అల్లర్లు, అస్సాం వరదలు, రూపాయి విలువ తగ్గడాన్ని PM పట్టించుకోరని విమర్శించారు.

News June 25, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజ ఓపెనర్ గుడ్‌బై

image

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. T20 ప్రపంచకప్ తనకు చివరి టోర్నమెంట్ అని గతంలోనే వార్నర్ ప్రకటించారు. నిన్న INDపై ఆస్ట్రేలియా ఓడిపోవడంతో అదే అతడికి చివరి మ్యాచ్ అయింది. తన చివరి వన్డే 2023 WC ఫైనల్లో INDపై, చివరి టెస్టు 2024 జనవరిలో PAKపై ఆడారు. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 18,995 రన్స్ చేశారు. అందులో 49 సెంచరీలున్నాయి.