News June 25, 2024

ఇది కదా అసలైన మజా!!

image

T20WC: అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను మైమరిపించింది. 116 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ చివరి వరకు పోరాడింది. 10 ఓవర్ల వరకు బంగ్లాదే విజయం అని అందరూ భావించారు. కానీ రషీద్ ఒక్కసారిగా మ్యాచును టర్న్ చేశారు. వర్షం, దాస్ పోరాటం, వికెట్లు, రన్స్.. ఇలా క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ పసందైన విందు ఇచ్చింది. అద్భుత పోరాటంతో చివరకు అఫ్గాన్ గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.

News June 25, 2024

స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నిక

image

చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది. NDA ప్రతిపాదించిన ఓంబిర్లాకు INDIA కూటమి మద్దతివ్వలేదు. తమకు డిప్యూటీ స్పీకర్ పదవిస్తే ఓంబిర్లాకు తాము మద్దతిస్తామని చేసిన INDIA కూటమి అభ్యర్థనపై NDA స్పందించలేదు. దీంతో INDIA కూటమి తరఫున కె.సురేశ్ స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాగా స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. మన దేశంలో ఇప్పటివరకు లోక్‌సభ స్పీకర్లంతా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

News June 25, 2024

రాత్రి 7 గంటలకు ‘భారతీయుడు-2’ ట్రైలర్

image

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్, కాజల్, SJ సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది.

News June 25, 2024

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నా: జీవన్ రెడ్డి

image

TG: తనకు పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. MLC పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని చెప్పారు. రాజీనామా చేసి పల్లెలన్నీ తిరగనున్నట్లు తెలిపారు. BJP నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని, కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ‘ఇన్నాళ్లు పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పాటించా. కానీ ఈరోజు నాకు గౌరవం దక్కలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

News June 25, 2024

భారీ వేలమే.. కానీ నో ఇంట్రెస్ట్!

image

నేడు జరగనున్న 5జీ వేలానికి టెలికాం సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్రానికి సంస్థలు చేసిన ఎర్నెస్ట్ డిపాజిట్ 2022తో పోలిస్తే 79-86% తక్కువ. జియో ₹3వేలకోట్లు, ఎయిర్‌టెల్ ₹1,050కోట్లు, Vi ₹300 కోట్లు కేటాయించాయి. ₹96,320cr విలువైన వేలంలో 13% (₹12,500) మాత్రమే సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు అంచనా.

News June 25, 2024

గుల్బాదిన్ గాయంపై ఇయాన్ స్మిత్ సెటైర్లు

image

కాలి కండరం పట్టేసిన అఫ్గానిస్థాన్ ప్లేయర్ గుల్బాదిన్ నాయబ్ నిమిషాల్లోనే తిరిగి పరిగెత్తడంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ డేవిడ్ స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నేను గత 6 నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. ఈ గేమ్ ముగిసిన వెంటనే గుల్బాదిన్‌కు చికిత్స అందించిన వైద్యుడిని కలవబోతున్నా. అతను ప్రస్తుతం ప్రపంచంలోని 8వ అద్భుతం అని నేను అనుకుంటున్నా’ అని సెటైర్లు వేశారు.

News June 25, 2024

ఊపిరి పీల్చుకున్న మూడు దేశాల ఫ్యాన్స్

image

T20WC సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణతో 3 దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కంగారూ ఫోబియా ఉన్న భారత్, ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్, ఆసీస్‌ను ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడ్డ సౌతాఫ్రికా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కంగారూ జట్టు సెమీస్‌, ఫైనల్‌కి వస్తే కప్పు గెలవకుండా వెళ్లదనే నమ్మకమే ఇందుకు కారణం. కాగా సూపర్8లో బంగ్లాదేశ్‌పై గెలిచిన అఫ్గాన్ సెమీస్ చేరింది.

News June 25, 2024

బరువు తగ్గించలేదని విడాకులు కోరిన భార్య

image

జిమ్ ట్రైనర్ అయిన భర్త తన బరువు తగ్గించలేకపోయాడని ఆగ్రాలో ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ట్రైనర్ శరీరాకృతి చూసి ముగ్ధురాలై గతేడాది అతడిని వివాహం చేసుకుంది. తన బరువు కూడా తగ్గించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది. అందుకు అతడూ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు కొంచెం కూడా బరువు తగ్గించలేకపోవడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అటు జిమ్ ట్రైనర్ మాత్రం భార్యతోనే ఉంటానని చెబుతున్నారు.

News June 25, 2024

నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్లు

image

పార్లమెంటులో నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే కేంద్రమంత్రులు, ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు. స్పీకర్ పోస్టుకు ప్రతిపక్షాలూ పోటీకి సిద్ధపడుతుండటంతో ఈ నామినేషన్లు ఆసక్తికరంగా మారాయి. మాజీ స్పీకర్ ఓం బిర్లానే NDA మరోసారి బరిలో నిలపనున్నట్లు సమాచారం. కాగా నామినేషన్లపై రాజీ కుదిర్చేందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలను సంప్రదిస్తున్నారు.

News June 25, 2024

జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్టీలోనే కొనసాగనున్నప్పటికీ MLC పదవి నుంచి మాత్రం తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారట. BRS MLA సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్దలతో చర్చల తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే ఛాన్సుంది. మరోవైపు ఆయన మద్దతుదారులు HYD గాంధీభవన్ దగ్గర ఆందోళనకు సిద్ధమయ్యారు.