News June 25, 2024

బంగ్లాతో మ్యాచ్.. అఫ్గాన్ స్కోర్ ఎంతంటే?

image

సెమీస్ రేసులో బంగ్లాతో జరుగుతున్న కీలక మ్యాచులో అఫ్గాన్ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 రన్స్ మాత్రమే చేశారు. ఓపెనర్ గుర్బాజ్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లో రషీద్ 2 సిక్సర్లతో అలరించారు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో రన్స్ రాబట్టేందుకు అఫ్గాన్ బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది. మ్యాచ్ రద్దయితే అఫ్గాన్ SFకు వెళ్తుంది.

News June 25, 2024

నా కల 50 శాతం నెరవేరింది: నితీశ్

image

భారత జట్టుకు ఎంపికవడంతో తన కల 50 శాతం నెరవేరిందని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియన్ జెర్సీ ధరించి జట్టుకు విజయాలను అందించినప్పుడే తన కల పూర్తిగా నెరవేరుతుందని తెలిపారు. తన కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డ తండ్రి ముత్యాల రెడ్డిని గర్వపడేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. 2024 IPLలో SRH తరఫున నితీశ్ 11 మ్యాచుల్లో 303 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

News June 25, 2024

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంపై బిల్లు?

image

TG: భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 122 రెవెన్యూ చట్టాలన్నింటినీ ఒకే చట్టంగా రూపొందించాలని భావిస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌నూ మార్చనున్నట్లు సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News June 25, 2024

తెలంగాణలో ఉన్న భూముల వివరాలు ఇవే!

image

☛ సాగుకు అనువైన భూమి: 2.55 కోట్ల ఎకరాలు
☛ సాగులో ఉన్న భూమి: 1.42 కోట్ల ఎకరాలు
☛ వ్యవసాయేతర భూమి: 11.85 లక్షల ఎకరాలు
☛ వక్ఫ్, దేవదాయ ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములు: 89.99 లక్షల ఎకరాలు

News June 25, 2024

T20WC: సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ

image

టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8లో ఆస్ట్రేలియాపై విజయంతో టీమ్ఇండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎల్లుండి (జూన్ 27న) గయానాలో రా. 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. తొలుత భారత్ 168 రన్స్ చేయగా, వికెట్లేమీ కోల్పోకుండా ఇంగ్లండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు.

News June 25, 2024

మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్?

image

TG: రాష్ట్ర కేబినెట్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేకపోవడంతో ఆయనను తీసుకుంటున్నట్లు టాక్. కాగా నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, వేణుగోపాల్‌తో పోచారం భేటీ అయిన సంగతి తెలిసిందే.

News June 25, 2024

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని తీర్మానం

image

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్ నిన్న సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాయి. విపక్షాలు పలు సవరణలు సూచించాయి. కాగా గత ఏడాది కూడా కేరళ ప్రభుత్వం దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

News June 25, 2024

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

AP: మెగా DSCతో పాటు TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన TETలో పాస్ కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత DSC ప్రిపరేషన్‌కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

News June 25, 2024

EMERGENCY: ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ!

image

దేశ చరిత్రలోనే ఈ రోజు ఒక బ్లాక్ డే. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇందుకు కారణాలేమైనా దేశంలో పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెట్టారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు.

News June 25, 2024

ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న భారత్..!

image

వన్డే WC-2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి 140 కోట్ల మంది భారతీయుల మనసులను గాయపరిచింది. అదే ఏడాది WTC ఫైనల్లోనూ మనకు టైటిల్ దక్కకుండా చేసింది. ఈ ఓటములకు తాజా టీ20 WCలో భారత్ బదులు తీర్చుకుంది. టీమ్ ఇండియా దెబ్బకు కంగారూల సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు సెమీస్‌కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. AFGపై బంగ్లా గెలవాలని AUS కెప్టెన్ దేవుడిని తలచుకున్నారు.