News June 24, 2024

ఏపీలో ప్రభాస్ కల్కి మూవీ టికెట్ రేట్ల పెంపు

image

AP: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి- 2898AD’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ <<13492922>>ప్రభుత్వం<<>> అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2వారాల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.125 మేర పెంచుకోవచ్చంది. అలాగే రోజుకు ఐదు షోలు వేసేందుకు కూడా అనుమతిచ్చింది. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచింది. ఈ నెల 27న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

News June 24, 2024

GADకి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ

image

AP: సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై బదిలీ వేటు పడింది. సాధారణ పరిపాలన శాఖ(GAD)లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. ఇటీవల బదిలీల్లో వ్యవసాయ, గనుల శాఖ నుంచి కార్మికశాఖకు ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. గతంలో సచివాలయాలకు పార్టీ రంగులు వేయడం సహా పలు అంశాల దృష్ట్యా ఆయన్ను GADకు అటాచ్ చేసింది.

News June 24, 2024

రాహుల్ గాంధీని కలిసిన పోచారం

image

TG: ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ ఆయనతో పాటు ఉన్నారు. నిన్న జగిత్యాల ఎమ్మెల్యేను సీఎం రేవంత్ పార్టీలోకి ఆహ్వానించగా, మరో 20 మంది MLAలు తమతో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 64 నుంచి 70కి చేరింది.

News June 24, 2024

త్వరలోనే నామినేటెడ్ పదవులు: చంద్రబాబు

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని CM చంద్రబాబు తెలిపారు. TDP నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని పోరాడటం వల్లే ఘనవిజయం సాధ్యమైంది. కూటమి కోసం కష్టపడిన వారి పేర్లు సేకరిస్తున్నాం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను వేధించిన YCP నేతలకు TDPలోకి నో ఎంట్రీ’ అని వెల్లడించారు.

News June 24, 2024

ఒకే ఓవర్లో 38 పరుగులు

image

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో వార్సెస్టర్‌షైర్(WOR) ప్లేయర్ డాన్ లారెన్స్ రెచ్చిపోయారు. సర్రేతో జరుగుతున్న మ్యాచులో ఇన్నింగ్స్ 128వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు బాదారు. ఈ ఓవర్లో ఎక్స్‌ట్రాలతో కలుపుకుని ఏకంగా 38 పరుగులు వచ్చాయి. లారెన్స్ 223 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేశారు. కాగా WOR తొలి ఇన్నింగ్సులో 490 పరుగులు చేయగా సర్రే 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.

News June 24, 2024

రోహిత్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు

image

T20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్(92) విధ్వంసానికి తోడు సూర్య(31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. AUS టార్గెట్ 206 పరుగులు.

News June 24, 2024

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆటగాళ్ల జాబితాలో రోహిత్

image

టీ20ల్లో ఫాస్టెస్ట్ 50s చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్.. గంభీర్(Vs శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో KL రాహుల్(Vs స్కాట్లాండ్), సూర్యకుమార్(Vs SA) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేశారు.

News June 24, 2024

ఎల్లుండి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

News June 24, 2024

సరోగసీ తల్లులకు 6నెలల సెలవులు: కేంద్రం

image

సరోగసీ ద్వారా పిల్లల్ని పొందే మహిళా ఉద్యోగులకు 6 నెలల(180 రోజులు) సెలవులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు సెలవులకు సంబంధించిన 1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలను సవరించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి అయిన సరోగసీ శిశువు తండ్రికి కూడా 15 రోజుల సంరక్షణ సెలవులు మంజూరు కానున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్లో ఇప్పటివరకు ఈ నిబంధనలు లేవు.

News June 24, 2024

ఆ యాప్స్‌తో క్రెడిట్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోనున్నాయా?

image

క్రెడ్, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో జులై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయే అవకాశముంది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నుంచే జరగాలన్న RBI రూలే ఇందుకు కారణం. ఈ సిస్టమ్‌ను SBIతో సహా 8బ్యాంకులు యాక్టివేట్ చేసుకోగా HDFC, ICICI, AXIS వంటి బ్యాంకులు ఇంకా యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఆ యాప్స్‌లో బిల్లులు చెల్లించలేరు. అయితే Bank వెబ్సైట్, APPతో చెల్లింపులు జరపొచ్చు.