India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారన్న విషయం తెలిసిందే. దీంతోపాటు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కూడా అందిస్తోందీ ఫౌండేషన్. ఇవాళ సెకండ్ ఫేజ్ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు MB ఫౌండేషన్ ట్వీట్ చేసింది. యువతులకు HPV వ్యాక్సిన్‌ను అందించినట్లు తెలిపింది. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్‌లను నిరోధించగలదు.
మావోయిస్టులే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టపై భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు, CRPF బలగాలు సంయుక్తంగా గుట్టను చుట్టుముట్టి కాల్పులతో చొచ్చుకెళ్తున్నాయి. అక్కడ భారీగా మావోలు ఉంటారనే సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. కాగా కర్రెగుట్ట చుట్టూ బాంబులు పెట్టామని, ఎవరూ రావొద్దని ఇటీవలే మావోలు ప్రకటించారు. తాజా ఘటనతో ఏం జరుగుతుందోనని స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
AP: ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూకేటాయింపుల ప్రక్రియను <<16177186>>కేశినేని నాని<<>> తప్పుబట్టడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వేలకోట్లు ఎగ్గొట్టిన వారు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏ పరిశ్రమలు తీసుకురావాలో బాగా తెలుసని, నాని ఉపన్యాసాలు వినే తీరిక ఆయనకు లేదన్నారు. ఉనికి కోసమే ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు.
భారత స్మార్ట్ టీవీ మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చెక్ పెట్టింది. ఆపరేటింగ్ సిస్టమ్(OS), ప్లే స్టోర్(PS) తదితర యాప్‌లను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయొద్దని ఆదేశించింది. దీంతో సెటిల్‌మెంట్‌లో భాగంగా రూ.20.24 కోట్లు చెల్లించేందుకు గూగుల్ అంగీకరించింది. ఇకపై టీవీల్లో ఇతర OS, PSలూ ఉండే అవకాశాలున్నాయి. మీరు కొనుగోలు చేసే టీవీలో ఏవి ఇన్‌స్టాల్ చేశారో చెక్ చేసుకోండి.
TG: నేటి నుంచి మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలను టచ్ చేస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో 42-44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావొచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచించారు.
TG: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని TGFDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. HICC వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలను ఎంకరేజ్ చేస్తామన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటలతో గద్దర్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.
TG: విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కాబోతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ.12 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే Way2Newsలో చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే బాక్సులో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్డ్ మార్క్స్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఈజీగా మీ స్నేహితులకు షేర్ చేయవచ్చు.
AP: లిక్కర్ స్కామ్‌లో తాను ఒక్క రూపాయీ ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్(సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తి). దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అని తెలిపారు.
హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ ఇంపోజిషన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూసి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భయపడ్డారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మహారాష్ట్రలో కేవలం మరాఠీ తప్పనిసరంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా చెప్పిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే మూడో భాషా బోధన తప్పనిసరి కాదంటూ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.
Sorry, no posts matched your criteria.