News June 23, 2024

SA-Wపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

image

భారత మహిళల జట్టు అదరగొట్టింది. సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 215/8 స్కోర్ చేయగా, టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్‌ప్రీత్ 42, జెమీమా 19* రన్స్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతీరెడ్డి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.

News June 23, 2024

కల్తీ మద్యం కుట్ర వెనుక అన్నామలై: DMK నేత

image

తమిళనాడులో కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన మిథనాల్‌ను NDA పాలిత పుదుచ్చేరి నుంచి సేకరించారని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి తెలిపారు. ఈ కుట్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అమలు చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జరిగిందా అనే సందేహం ఉందన్నారు. ఈ మరణాలకు బాధ్యత వహించి CM స్టాలిన్ రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. ఎవరైనా రిజైన్ చేయాల్సి వస్తే అది పుదుచ్చేరి సీఎం, బీజేపీ మంత్రులేనని స్పష్టం చేశారు.

News June 23, 2024

దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు ఏర్పాటు చేస్తాం: SBI

image

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మరో 400 శాఖల్ని ఏర్పాటు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్ ఖారా ప్రకటించారు. గత ఏడాది 137 తెరిచామని, వాటిలో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని వెల్లడించారు. తమ సేవలు అవసరం అనుకున్న ప్రాంతాల్లో శాఖల్ని తెరవనున్నట్లు వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి ఎస్‌బీఐకి 22,542 శాఖలుండటం విశేషం.

News June 23, 2024

చికెన్ బిర్యానీలో పురుగు

image

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెహ్‌ఫిల్ రెస్టారెంట్ చికెన్ బిర్యానీలో పురుగు వచ్చిందని ఓ కస్టమర్ ట్విటర్‌లో వాపోయారు. స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా పురుగు కనిపించిందని చెప్పారు. ఈ విషయాన్ని స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి రూ.64 రిఫండ్ చేసినట్లు తెలిపారు. కానీ తాను ఆర్డర్ చేసిన బిర్యానీకి రూ.318 ఖర్చయిందని, మెహ్‌ఫిల్ నుంచి ఎవరూ ఆహారం ఆర్డర్ చేయొద్దని అతడు సూచించారు.

News June 23, 2024

ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతరం.. సాయం కోరిన జెలెన్‌స్కీ

image

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తీవ్రతను మరింతగా పెంచింది. బాంబులతో ఆ దేశ నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పలువురు పౌరులు ఈ దాడుల్లో మృతిచెందారు. దీంతో తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. అత్యాధునిక ఆయుధాలను, రక్షణను సమకూర్చాలని అడిగారు. సుదూర లక్ష్యాలను ఛేదించే వ్యవస్థల అవసరం ఉందని, ఆమేరకు సాయం చేయాలని ఓ ప్రకటనలో కోరారు.

News June 23, 2024

జమ్మూకశ్మీర్‌లో 40మంది పాక్ ఉగ్రవాదులు?

image

జమ్మూకశ్మీర్‌లో 40మంది వరకు పాక్ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా జమ్మూలోని రాజౌరి, పూంఛ్, కథువా సెక్టార్లలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న బృందాలుగా విడిపోయి ఉగ్రవాదాన్ని మళ్లీ బతికించేందుకు ముష్కరులు యత్నిస్తున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. వారిని ఏరివేసేందుకు జల్లెడ పడుతున్నామన్నాయి. ఈ నెల 9 నుంచి జమ్మూకశ్మీర్‌లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

News June 23, 2024

BREAKING: రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

image

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు రిజల్ట్స్ రిలీజ్ చేయనుంది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ <>results.cgg.gov.in<<>>తో పాటు అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWS యాప్‌లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు.
* SHARE IT

News June 23, 2024

‘SSMB29’ మ్యూజిక్ వర్క్ త్వరలో ప్రారంభిస్తా: కీరవాణి

image

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీ స్టోరీ ఈ వారమే ఫిక్స్ అయినట్లు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపారు. ప్రస్తుతం టెస్టు షూట్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా సినిమా మ్యూజిక్ పనులు ప్రారంభించలేదన్నారు. జులై/ఆగస్టులో మొదలుపెడతానని పేర్కొన్నారు.

News June 23, 2024

40 ఏళ్లలోపు వారిలో ప్రబలుతున్న క్యాన్సర్

image

భారత్‌లో 40 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్ తీవ్రస్థాయిలో ప్రబలుతోంది. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం దేశంలో 20శాతం క్యాన్సర్ రోగులు 40 ఏళ్లలోపు వారే. వీరిలో 60శాతం మంది యువకులు, 40శాతం మంది యువతులు ఉన్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, మద్యపానం, ధూమపానం, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

News June 23, 2024

పవన్‌తో రేపు సినీ నిర్మాతల సమావేశం

image

AP: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో రేపు మధ్యాహ్నం సినీ నిర్మాతలు విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో సమావేశం కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఎన్డీయే సర్కారుకు అభినందనలు తెలియజేయడంతో పాటు చిత్ర పరిశ్రమ సమస్యల్ని కూడా ఆయనకు వివరించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, దిల్ రాజు తదితరులున్నారు.