News June 23, 2024

GOOD NEWS: తగ్గనున్న ఉల్లి ధరలు

image

దేశంలో పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 71వేల టన్నుల ఆనియన్స్‌ను కొనుగోలు చేసింది. దశలవారీగా ఈ ఏడాది 5 లక్షల టన్నులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రస్తుతం కేజీ రూ.40-50 మధ్య ఉన్న ధర క్రమంగా తగ్గుతుందని వినియోగవ్యవహారాల శాఖ అంచనా వేసింది. ఎండ తీవ్రత, వర్షాలు తక్కువగా ఉండటంతో రబీలో దిగుబడి తగ్గడం వల్ల ఉల్లి ధరలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.

News June 23, 2024

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

image

18వ లోక్‌సభ ఫస్ట్ సెషన్ రేపు ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. PM మోదీ, కేంద్ర మంత్రులతో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 280 మందితో ప్రొటెం స్పీకర్ మహతాబ్ రేపు ప్రమాణం చేయిస్తారు. ఎల్లుండి మిగతా 264 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ఏపీ ఎంపీలు రేపు, తెలంగాణ ఎంపీలు ఎల్లుండి ప్రమాణం చేస్తారు. ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుండగా, 27న రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

News June 23, 2024

మరో బిడ్డకు తండ్రయిన మస్క్.. మొత్తం 12 మంది!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో కలిసి మూడో బిడ్డకు జన్మనిచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వీరికి ఇప్పటికే కవలలు ఉన్నారు. 52 ఏళ్ల ఈ టెక్ దిగ్గజం పలువురు మహిళల ద్వారా 12 మంది(ఐదేళ్లలో ఆరుగురికి)కి తండ్రయినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మాజీ ప్రియురాలు గ్రిమ్స్‌కు ముగ్గురు, మాజీ భార్య జస్టిన్‌కు ఆరుగురు, శివోన్‌కు ముగ్గురు పిల్లలు పుట్టారట.

News June 23, 2024

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రియల్ ఫైటర్ కావాలి.. స్ట్రీట్ ఫైటర్ కాదు: ఈటల

image

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకుంటున్న ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర చీఫ్‌గా ఫైటర్ కావాలంటున్నారు. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటరా? రియల్ ఫైటరా? ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి. వీధుల్లో పోరాడేవారు కాదు’ అని పేర్కొన్నారు. కాగా అధ్యక్ష రేసులో రాజా సింగ్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News June 23, 2024

BREAKING: రెజ్లర్ బజరంగ్‌పై సస్పెన్షన్ వేటు

image

ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది.

News June 23, 2024

నా ఐడీ కార్డు.. స్వీట్ మెమోరీస్

image

AP: తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, నగరితో తనకున్న అనుబంధాన్ని TDP MLA భానుప్రకాశ్ పంచుకున్నారు. 2009లో ఇదే నియోజకవర్గంలో MLAగా ఉన్న తన తండ్రి ఐడీ కార్డును, ప్రస్తుత తన ఐడీ కార్డుతో జత చేసి Xలో పోస్ట్ చేశారు. ‘నాడు నగరి MLAగా ముద్దన్న అసెంబ్లీ ఐడెంటిటీ కార్డు. నేడు ముద్దు బిడ్డ భానన్న ఐడీ కార్డు’ అని రాసుకొచ్చారు. దీంతో ముద్దుకృష్ణను గుర్తుచేసుకుంటూ TDP శ్రేణులు ఈ పోస్టును వైరల్ చేస్తున్నాయి.

News June 23, 2024

BRS ఎమ్మెల్యేకు మంత్రి పొన్నం లీగల్ నోటీసులు

image

TG: హుజురాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. NTPC నుంచి ఫ్లై యాష్ రవాణా విషయంలో మంత్రి పొన్నం హస్తం ఉందని ఇటీవల కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేశారని కౌశిక్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ సహా పలు మీడియా సంస్థలకు పొన్నం నోటీసులు పంపించారు.

News June 23, 2024

లోక్‌సభలో టీడీపీ విప్‌గా బాలయోగి తనయుడు

image

AP: లోక్‌సభలో టీడీపీ విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌ మాథుర్‌ని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. గతంలో హరీశ్ తండ్రి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. సభను హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీశ్‌కి విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీశ్ ఎంపీగా గెలుపొందారు.

News June 23, 2024

పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే తన కుటుంబంపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని జనగామ BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. USలో నిర్వహించిన మీట్‌&గ్రీట్‌లో ఆయన మాట్లాడారు. కేసులు, అరెస్టులు తనకు కొత్త కాదని, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

News June 23, 2024

మీ IRCTC ఐడీపై ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే

image

మీ IRCTC అకౌంట్లో ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. రైలు రిజర్వేషన్లపై కొత్త రూల్స్ తాజాగా అమల్లోకి వచ్చాయి. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం ఆధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకే మీ ఐడీతో టికెట్లు బుక్ చేయవచ్చు. లేదంటే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా రెండూ విధిస్తారు.