News June 23, 2024

BRS ఎమ్మెల్యేకు మంత్రి పొన్నం లీగల్ నోటీసులు

image

TG: హుజురాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. NTPC నుంచి ఫ్లై యాష్ రవాణా విషయంలో మంత్రి పొన్నం హస్తం ఉందని ఇటీవల కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేశారని కౌశిక్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ సహా పలు మీడియా సంస్థలకు పొన్నం నోటీసులు పంపించారు.

News June 23, 2024

లోక్‌సభలో టీడీపీ విప్‌గా బాలయోగి తనయుడు

image

AP: లోక్‌సభలో టీడీపీ విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌ మాథుర్‌ని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. గతంలో హరీశ్ తండ్రి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. సభను హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీశ్‌కి విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీశ్ ఎంపీగా గెలుపొందారు.

News June 23, 2024

పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే తన కుటుంబంపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని జనగామ BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. USలో నిర్వహించిన మీట్‌&గ్రీట్‌లో ఆయన మాట్లాడారు. కేసులు, అరెస్టులు తనకు కొత్త కాదని, న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

News June 23, 2024

మీ IRCTC ఐడీపై ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే

image

మీ IRCTC అకౌంట్లో ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. రైలు రిజర్వేషన్లపై కొత్త రూల్స్ తాజాగా అమల్లోకి వచ్చాయి. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం ఆధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకే మీ ఐడీతో టికెట్లు బుక్ చేయవచ్చు. లేదంటే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా రెండూ విధిస్తారు.

News June 23, 2024

ఇళ్ల స్థలాల కోసం ఆందోళన.. మియాపూర్‌లో 144 సెక్షన్

image

HYD శివారులోని మియాపూర్, చందా‌నగర్‌లో ఈనెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. మదీనాగూడ సర్వే నం.100, 101లో ఉన్న HMDA భూముల ఆక్రమణకు నిన్న పలువురు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థలాల్లో తమకు ఇళ్లు/పట్టాలు ఇవ్వాలంటూ ఆక్రమణదారులు డిమాండ్ చేస్తుండగా, చట్ట విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News June 23, 2024

తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు చంద్రబాబూ?:YCP

image

AP: పార్టీ ఆఫీసుల నిర్మాణంపై TDP విమర్శలకు వైసీపీ Xలో కౌంటరిచ్చింది. ‘పార్టీ కార్యాలయాలకు స్థలాల GO ఇచ్చింది మీరు కాదా? దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా TDP ఆఫీసులు నిర్మించుకుంది నిజం కాదా? HYDలో పాతికేళ్ల క్రితం NTR భవన్‌కు ఇలానే స్థలం కేటాయించుకున్న విషయం మీ చంద్రబాబు మర్చిపోయారా? మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా? మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు?’ అని ఫైరయ్యింది.

News June 23, 2024

ఎల్లుండి ‘భారతీయుడు-2’ ట్రైలర్ విడుదల

image

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, కాజల్, SJ సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జులై 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

News June 23, 2024

డయేరియాపై అధికారులతో మంత్రి సమీక్ష

image

AP: NTR(D) జగ్గయ్యపేటలో డయేరియా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా, 35 మందికి పైగా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. ‘మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. నీటి సమస్య కారణంగా ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నాం. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి’ అని ఆయన సూచించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు.

News June 23, 2024

HYDలో వచ్చే నెలలో అన్న క్యాంటీన్ ప్రారంభం

image

ఏపీ సీఎం చంద్రబాబు మానసపుత్రిక అన్న క్యాంటీన్‌ను హైదరాబాద్‌లో CBN ఫోరం వ్యవస్థాపకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జులై మొదటి వారంలో ఇక్కడ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఫోరం ద్వారా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News June 23, 2024

26 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు

image

AP: ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కారణంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.