News June 22, 2024

భారత్ సాయంతోనే కోలుకున్నాం: విక్రమసింఘే

image

భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డామని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. కొలంబోలో జరిగిన అఖిల భారత భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు వివరించారు.

News June 22, 2024

పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందే: డిప్యూటీ సీఎం పవన్

image

AP: రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందులో భాగంగా పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాలన్నారు. తన నివాసంలో అటవీ శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ప్రతి జిల్లాలోని కాలుష్యం లెక్కలు తీయాలని, జల, వాయు కాలుష్యాల వివరాలు అందించాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల శుద్ధీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.

News June 22, 2024

త్వరలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య రెట్టింపు

image

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2 కోచ్‌లు ఉన్న రైళ్లలో 4కు, జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు 2 బోగీలను సమకూరుస్తామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,377 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, అదనంగా 2,500 జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఒక్కో కోచ్‌లో 150-200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తెలిపింది.

News June 22, 2024

జగన్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తప్పుడు వార్తలు: YCP

image

AP: పులివెందులలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయని కొన్ని ఛానళ్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని వైసీపీ తెలిపింది. ‘జగన్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, కార్యకర్తలు ఆగ్రహించారని ఆ మీడియా పిచ్చిరాతలు రాసుకుంది. జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చిన విషయాన్ని మరుగునపరచడానికి, వక్రీకరించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

News June 22, 2024

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

image

AP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ఖరారైంది. పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు CBN దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు.. ఇటీవల టీడీపీలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు.

News June 22, 2024

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు రేపు భారత జట్టు ప్రకటన?

image

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టును BCCI రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఈ సిరీస్‌లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి, ఐపీఎల్‌లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లను సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం. జులై 6 నుంచి జరిగే ఈ 5 మ్యాచుల సిరీస్‌కు హార్దిక్/సూర్య కెప్టెన్సీ వహించే ఛాన్సుందని, ఒకవేళ వారికి రెస్ట్ ఇస్తే శ్రేయస్, రుతురాజ్, పంత్‌లో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వొచ్చని క్రీడా విశ్లేషకుల అంచనా.

News June 22, 2024

రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన విద్యార్థిని

image

ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే వైద్య విద్యార్థిని రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విరాళం అందజేశారు. పొలం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, బంగారు గాజులు అమ్మి పోలవరం కోసం మరో రూ.1 లక్ష విరాళంగా ఇచ్చినట్లు పేరెంట్స్ తెలిపారు. తన తండ్రి మనోజ్‌తో కలిసి సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. వైష్ణవిని అభినందించిన CM ఆమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

News June 22, 2024

జగన్‌పై పులివెందుల ప్రజలు తిరగబడ్డారు: TDP

image

AP: వైఎస్ జగన్ ఫ్యూడల్ మనస్తత్వంపై పులివెందుల వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని టీడీపీ ట్వీట్ చేసింది. జగన్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొంది. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమై ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపింది. జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారని రాసుకొచ్చింది.

News June 22, 2024

T20WC: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ బ్యాటింగ్

image

T20WC సూపర్-8లో భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
IND: రోహిత్, కోహ్లి, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, అర్ష్‌దీప్, కుల్దీప్, బుమ్రా
BAN: అంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్, తౌహిద్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్, మహేదీ హసన్, తంజిమ్, ముస్తాఫిజుర్

News June 22, 2024

T20WC: బౌలర్ల జోరు.. అయినా సిక్సర్ల హోరు

image

ఈ టీ20 వరల్డ్ కప్‌లో బౌలర్లు సత్తా చాటుతున్నప్పటికీ బ్యాటర్లు సిక్సర్ల జోరును కొనసాగిస్తున్నారు. WC హిస్టరీలో అత్యధిక సిక్సర్లు(412) నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. 2021లో 405 సిక్సర్లు బాదగా, ప్రస్తుతం ఆ రికార్డు బ్రేకయ్యింది. మరిన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున 500 మార్క్‌కు చేరే అవకాశం ఉంది. 2022లో 331, 2016లో 314, 2014లో 300 సిక్సర్లు నమోదయ్యాయి.