News October 1, 2024

సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సరికాదు: పురందీశ్వరి

image

AP: తిరుమల లడ్డూ అంశంలో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తప్పుపట్టారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.

News October 1, 2024

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి జలాలు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ జలాశయం నుంచి మూసీకి నీటిని తరలిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, గత ప్రభుత్వం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. గతంలో మూసీ ప్రక్షాళన కోసం తెచ్చిన రూ.1,000 కోట్ల అప్పు ఎందుకోసం ఖర్చు చేశారని నిలదీశారు.

News October 1, 2024

BIG BREAKING: లడ్డూ అంశంలో సిట్ దర్యాప్తు నిలిపివేత

image

AP: తిరుమల లడ్డూ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఎల్లుండి వరకు సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 3న ధర్మాసనం ఆదేశాల తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారుచేశారనడానికి ఆధారాలు లేకుండానే సీఎం చంద్రబాబు ఎలా ప్రకటన చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News October 1, 2024

రోడ్డు మధ్యలో దర్గా, గుడి, గురుద్వారా ఏదైనా కూల్చాల్సిందే: సుప్రీంకోర్టు

image

బుల్డోజర్ యాక్షన్‌పై తమ వ్యాఖ్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘మనది సెక్యులర్ కంట్రీ. పబ్లిక్ రోడ్, ఫుట్‌పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్లో ఆక్రమణలు అన్నిటికీ మా ఆదేశాలు వర్తిస్తాయి. రోడ్డు మధ్యలో గుడి, గురుద్వారా, దర్గా సహా ఎలాంటి మతపరమైన కట్టడాలున్నా కూల్చేయాల్సిందే. అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం. వాటికి మతాలతో సంబంధం లేదు’ అని వివరించింది.

News October 1, 2024

HYD నుంచి సైన్యానికి చేరిన మొదటి స్వదేశీ సబ్‌మెషీన్ గన్స్

image

ASMI పేరుతో భారత్‌లో డెవలప్ చేసిన మొదటి సబ్‌మెషీన్ గన్స్‌ సైన్యం చేతికి అందాయి. వీటి డిజైన్, డెవలప్‌మెంట్, తయారీకి మూడేళ్ల కన్నా తక్కువ సమయమే పట్టింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ Uzi, జర్మనీ MP5 కన్నా ఇవెంతో మెరుగ్గా పనిచేస్తాయి. పైగా వాటితో పోలిస్తే 10-15% బరువు, 30% ధర తక్కువ. రూ.లక్ష లోపే లభిస్తాయి. హైదరాబాద్ కంపెనీ లోకేశ్ మెషీన్స్ 550 ASMITA గన్స్‌ను ఆర్మీకి డెలివరీ చేసింది.

News October 1, 2024

ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT

News October 1, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖలో కేంద్రాలు సిద్ధం చేసి నిపుణులతో తరగతులు చెప్పించనుంది. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపినవారిని ట్రైనింగ్‌కు ఎంపిక చేయనుంది. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకోనున్నట్లు సమాచారం.

News October 1, 2024

తిరుమల లడ్డూ వివాదం.. కేంద్రం ఏం చేయబోతోంది?

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలపై నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ విచారణను కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అనే దానిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి నివేదిక సైతం దానికి అనుకూలంగానే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

News October 1, 2024

CM ఇంటిముందు ధర్నా చేస్తా: మైనంపల్లి

image

TG: కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు హాట్ కామెంట్స్ చేశారు. RRR ప్రాజెక్టు నుంచి BRS MLA హరీశ్ భూములను తప్పించారని ఆరోపించారు. రెండు రోజుల్లో తాను హరీశ్‌రావు భూములను సందర్శిస్తానన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.

News October 1, 2024

నవంబర్ 14న ‘మట్కా’ రిలీజ్

image

కరుణ కుమార్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘మట్కా’ మూవీని నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెగా ప్రిన్స్ రెట్రో స్టైలిష్ లుక్‌ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1958-1982 మధ్య జరిగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.