News June 22, 2024

GOOD NEWS: తగ్గిన బంగారం ధరలు

image

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.72,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.66,350కి చేరింది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2,000 దిగి రూ.92,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

News June 22, 2024

పని చెప్పకుండా 20 ఏళ్లుగా జీతం చెల్లింపు.. కోర్టు మెట్లెక్కిన ఉద్యోగి

image

ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోబెట్టి జీతం ఇస్తామంటే ఎవరు కాదంటారు. ఫ్రాన్స్‌లోని టెలికాం దిగ్గజం ఆరెంజ్‌‌లో పనిచేసే లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్‌‌కు 20 ఏళ్లుగా ఎలాంటి పని చెప్పకుండా జీతం చెల్లిస్తున్నారు. అయితే పని చేయకుండా జీతం తీసుకోవడం చాలా కష్టంగా ఉందని ఆమె కంపెనీపై కేసు వేసింది. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆమెకు తగిన పని లేకపోవడంతో కంపెనీ ఇలా చేస్తోంది.

News June 22, 2024

హాసనలో మరో ఘోరం.. యువకుడిపై MLC అత్యాచారం!

image

హాసన మాజీ MP ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసు కర్ణాటకను కుదిపేస్తున్న వేళ మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై ఓ MLC అత్యాచారానికి పాల్పడ్డాడని హాసనకు చెందిన ఓ యువకుడు(25) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆపై బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపించాడు. అయితే రూ.5కోట్ల కోసం అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని MLC ఆప్తుడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News June 22, 2024

YCP ఎమ్మెల్యేలు వేడుకుంటే జగన్‌కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు: TDP

image

AP: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌ను అగౌరవపరిచారంటూ తమ పత్రికలో వార్త రాయించిన భారతిరెడ్డి ఇప్పటికైనా చెత్త రాతలు ఆపాలని TDP ట్వీట్ చేసింది. ‘మీ భర్త ప్రతిపక్ష నేత హోదానీ ప్రజలు పీకేశారు. ఇప్పుడు అతను 175 మందిలో ఒక సాధారణ MLA. మా సైకో తట్టుకోలేడని మీ YCP MLAలు వేడుకుంటే మంత్రుల తర్వాత చంద్రబాబు అవకాశం ఇచ్చారు. లేదంటే అక్షర క్రమంలో మీ పులివెందుల MLA చిట్టచివర ప్రమాణం చేసేవాడు’ అని కౌంటర్ ఇచ్చింది.

News June 22, 2024

దూబే స్థానంలో శాంసన్‌ని తీసుకుంటారా?

image

ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే T20WCలో రాణించడం లేదు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈరోజు బంగ్లాదేశ్‌తో జరిగే కీలక సూపర్8 మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా సంజూ బ్యాటింగ్‌కు దిగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి స్పిన్, పేస్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోగల సంజూకి ఛాన్స్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి.

News June 22, 2024

ఇండియన్ కాకులను చంపేందుకు కెన్యా ప్లాన్!

image

సుమారు 10లక్షల కాకులను అంతమొందించేందుకు కెన్యా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వలస వెళ్లి తమ దేశ పర్యావరణం, పరిశ్రమలను దెబ్బ తీస్తున్నాయట. ఆహారాన్ని దొంగలించడం, పంటలకు నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత కాకులు లేకుంటేనే కెన్యాలో కీటకాలు, ఇతర చిన్న జీవులు సమృద్ధిగా పెరుగుతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

News June 22, 2024

T20 WC: అత్యధిక సిక్సర్ల రికార్డ్ బద్దలు

image

విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఒక వరల్డ్ కప్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ సీజన్లో ఇప్పటివరకు పూరన్ 17 సిక్సర్లు బాదారు. దీంతో గేల్ (16) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఆ తర్వాతి స్థానాల్లో శామ్యూల్స్-15(2012), వాట్సన్-15(2012) ఉన్నారు.

News June 22, 2024

చైనాలో వరదలకు 47 మంది మృతి

image

చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మెయిజౌ నగరంలో శుక్రవారం 38 మంది మరణించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా పంట నష్టం భారీగా వాటిల్లిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

News June 22, 2024

గ్యాంగ్ రేప్.. అర్ధనగ్నంగా పరిగెత్తిన మహిళ

image

MPలోని ఉజ్జయినిలో 20ఏళ్ల గిరిజన వివాహితపై ఇద్దరు అత్యాచారం చేశారు. ఉపాధి కోసం వచ్చిన నిరుపేద దంపతులను గమనించిన రవి అనే వ్యక్తి పని ఇప్పిస్తానని ఓ ఇంట్లో ఉంచాడు. భర్తను పని సాకుతో ఊరి బయట దింపేందుకు తీసుకెళ్లాడు. అప్పుడు రవి అనుచరుడు ఇమ్రాన్ ఆమెను రేప్ చేశాడు. తర్వాత రవి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను తాను కాపాడుకోవడానికి బాధితురాలు 1.5kmలు అర్ధనగ్నంగా పరిగెత్తినట్లు పోలీసులు తెలిపారు.

News June 22, 2024

రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దు: ఏఈవో

image

TG: రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని నల్గొండ(D) పాలెం గ్రామానికి చెందిన AEO పరశురాములు సీఎం రేవంత్‌ను కోరారు. కుటుంబంలో తానొక్కడినే కిందిస్థాయి ఉద్యోగినని, ఇద్దరు తమ్ముళ్లు కూలీ పనులు చేస్తారన్నారు. తనకు ఉద్యోగం ఉందని తల్లిదండ్రులకు రేషన్ కార్డు తొలగించి, ఫించన్లు ఇవ్వడం లేదని తెలిపారు. తన తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు.