News June 22, 2024

పరీక్షల్లో అక్రమాల నియంత్రణకు చట్టం: కేంద్రం

image

ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అక్రమాల నియంత్రణ)చట్టం 2024’ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందినట్లు పేర్కొంది. దీని ప్రకారం ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కనిష్ఠంగా 3-5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. వ్యవస్థీకృత మోసాలకు పాల్పడితే 5-10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹కోటి జరిమానా విధించనుంది.

News June 22, 2024

జూన్ 22: చరిత్రలో ఈరోజు

image

1932: సినీ నటుడు అమ్రీష్ పురి జననం
1945: నాటక, సినీ రచయిత గణేష్ పాత్రో జననం
1952: చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు చిలుకూరి నారాయణరావు మరణం
1972: తమిళ హీరో విజయ్ జననం
1974: నటి దేవయాని జననం
1994: తెలుగు సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ మరణం
2016: రంగస్థల, సినిమా నటుడు J.V.రమణమూర్తి మరణం
* వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే

News June 22, 2024

MAHMADULLAH: హ్యాట్రిక్‌లలో సిక్సర్..!

image

బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్లా క్రికెట్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. అత్యధిక హ్యాట్రిక్‌లలో భాగమైన క్రికెటర్‌గా ఆయన నిలిచారు. మహ్మదుల్లా ఏకంగా 6 హ్యాట్రిక్‌లలో భాగమయ్యారు. మరే ఇతర బ్యాటర్ ఇలా ఇన్నిసార్లు హ్యాట్రిక్‌లలో భాగం కాలేదు. T20ల్లో 3, వన్డేల్లో 2, టెస్టుల్లో ఒకసారి హ్యాట్రిక్‌లో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఇంతటి దురదృష్టవంతుడు ఇంకెవరైనా ఉంటారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News June 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 22, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:18 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 22, 2024

ఐదేళ్లలో 43 పేపర్లు లీక్: ప్రియాంకా గాంధీ

image

BJP పాలనలో పరీక్షల పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయని INC నేత ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ఐదేళ్లలో ఏకంగా 43 పేర్లు లీకయ్యాయని ఆరోపించారు. కోట్లాది మంది యువత భవిష్యత్తును కమలం పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. ‘వివిధ రకాల పరీక్షల కోసం రేయింబవళ్లు యువత కష్టపడుతోంది. తల్లిదండ్రులు అన్నీ త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారు. పరీక్షల్లో అవకతవకలతో విద్యార్థుల శ్రమ వృథా అవుతోంది’ అని ఫైరయ్యారు.

News June 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 22, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 22, శనివారం జ్యేష్ఠమాసం
శు.పౌర్ణమి: ఉ.06:37 గంటలకు
బ.పాడ్యమి: ఉ.05:13 గంటలకు
మూల: సా.05:54 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.05:36-07:21 గంటల వరకు
వర్జ్యం: సా.04:20-05:54 గంటల వరకు

News June 22, 2024

TODAY HEADLINES

image

✒ CSIR UGC-నెట్ వాయిదా: NTA
✒ కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే
✒ AP: MLAలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల ప్రమాణస్వీకారం
✒ AP: స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
✒ AP: ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై పవన్ నిలదీత
✒ AP: మద్యంపై CBI విచారణ జరిపించాలి: పురందీశ్వరి
✒ TG: గనుల వేలంపై CM ఎందుకు ప్రశ్నించరు?: KTR
✒ రూ.2 లక్షల రైతు రుణమాఫీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
✒ INCలో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి

News June 22, 2024

18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా: నటి

image

అప్పట్లో ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కలవమని చెప్పినట్లు హీరోయిన్ ఇషా కొప్పికర్ తెలిపారు. కానీ తాను ఆయన విజ్ఞప్తిని తిరస్కరించానని చెప్పారు. ‘18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా. నన్ను చాలా మంది అసభ్యంగా తాకేవారు. పని కావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలని కొందరు సలహాలిచ్చేవారు’ అంటూ ఆమె వాపోయారు. కాగా చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ సినిమాల్లో ఇషా నటించారు.