India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీంతో భారత్ నుంచి ఈ ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా TG నిలిచింది. రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంపై రేవంత్ బృందం దృష్టి సారించింది.
AP: YCP నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ ఈ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని CIDని ఆదేశించిన HC, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
అమెరికన్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్, తన ప్రేయసి డైలాన్ మేయర్ పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజెలిస్‌లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. 2013లో ఓ సినిమా సెట్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. రెండేళ్ల డేటింగ్ అనంతరం 2021లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ట్విలైట్ ఫ్రాంచైజీ సినిమాలతో క్రిస్టెన్ పాపులయ్యారు. డైలాన్ మేయర్ నటిగా, రచయితగా పలు సినిమాలకు పనిచేశారు.
TG: యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.
TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్‌లో ఆయనపై నమోదైన FIRను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసినట్లు KTR ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.
TG: HYD స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో MIMకు మేలు చేసేలా INC, BRS వ్యవహరిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లీస్ పచ్చి మతోన్మాద, రజాకార్ల పార్టీ అని దుయ్యబట్టారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్‌కు దోస్తీనా అని నిలదీశారు. మజ్లీస్‌ను గెలిపించాలని సొంత పార్టీ కార్పొరేటర్లను BRS బెదిరిస్తోందని మండిపడ్డారు. BRSకు బాస్ KCR అయినా సూపర్ బాస్ అసదుద్దీన్ ఒవైసీ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
UPSC సివిల్స్ తుది ఫలితాలు ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. 1,056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 2024 జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. దీంతో ఫలితాల విడుదలకు UPSC కసరత్తు చేస్తోంది.
బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి తొలిసారి రూ.90,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగి రూ.98,350 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరగడంతో రూ.1,11,000గా ఉంది.
అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇతర దేశాలకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశానికి నష్టం కలిగించేలా యూఎస్‌తో ఎవరు ఒప్పందం చేసుకున్నా తీవ్రంగా పరిగణిస్తామని చైనా ప్రకటించింది. ప్రతీకార చర్యలకు వెనుకాడబోమని తేల్చి చెప్పింది. బీజింగ్‌తో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటే టారిఫ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తామని పలు దేశాలను యూఎస్ ప్రోత్సహిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది.
Sorry, no posts matched your criteria.