News June 20, 2024

నిరుద్యోగుల మహాధర్నా

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు దిగారు. గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస్టులు పెంచాలని కోరారు. గ్రూప్-2, 3 ప‌రీక్ష‌ల‌ను DEC వ‌ర‌కు వాయిదా వేయాలని, GO 46ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెగా DSC విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిపడ్డారు.

News June 20, 2024

UGC NETపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు: ప్రభుత్వం

image

UGC NETపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. అందుబాటులో ఉన్న సమాచారంతో పొరపాట్లను గుర్తించి పరీక్షను <<13472127>>రద్దు <<>>చేసినట్లు తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా జూన్ 18న NTA నిర్వహించిన ఈ పరీక్ష 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. తదుపరి నిర్వహణ తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

News June 20, 2024

అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం: సీఎం

image

AP: అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని అన్నారు.

News June 20, 2024

అశ్వినీ దత్ కాళ్లు మొక్కిన బిగ్ బీ.. RGV రియాక్షన్ ఇదే

image

‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వినీ దత్ కాళ్లకు నమస్కరించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘అమితాబ్ బచ్చన్ ఇలా చేయడం అశ్వినీదత్ సాధించిన విజయాల్లో అత్యున్నతం. NTR నుంచి తాజా యువ హీరోల వరకు ఎవరూ ఇలా చేసి ఉండరు. బిగ్ బీ తన కెరీర్ మొత్తంలో మరే ఇతర నిర్మాతకు ఇలా చేయడం నేను చూడలేదు’ అని ట్వీట్ చేశారు.

News June 20, 2024

సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్: చంద్రబాబు

image

AP: అమరావతి ఏపీ ప్రజలందరి చిరునామా అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. ‘జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. అమరావతిపై నిత్యం విష ప్రచారం చేశారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు’ అని అన్నారు.

News June 20, 2024

సంపద పెరిగినా ఆర్థిక అసమానతలు పోవా?

image

శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్ తన జోరును కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే ఆర్థిక అసమానతలను ఈ వృద్ధి తగ్గించలేదని అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ సంస్థ నిర్వహించిన పోల్‌లో నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలను ప్రధాన సమస్యగా పరిగణించట్లేదని పేర్కొన్నారు. కాగా వీరిలో పలువురు ఈ ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

News June 20, 2024

పదో తరగతి అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసై 18-26 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. జీతం రూ.19,500- రూ.37,815 వరకు అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 27లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్:https://ibpsonline.ibps.in/cbiskssnov23/

News June 20, 2024

ఐఐటీ బాంబేలో రామాయణానికి పారడీ.. విద్యార్థులకు ఫైన్

image

రామాయణం ఆధారంగా ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు వేసిన నాటకం విమర్శలకు దారి తీసింది. మార్చి 31న రాహోవన్ పేరిట చేసిన ఆ నాటకం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో నాటకం వేసిన వారిలో కొంతమందికి యాజమాన్యం తలా రూ.1.2లక్షల జరిమానా విధించింది. మరికొంతమందికి రూ.40వేలు, జూనియర్ స్టూడెంట్స్‌‌కు హస్టల్ నిషేధం వంటి శిక్షల్ని విధించింది.

News June 20, 2024

భారత్ సంపద 1000% పెరుగుతుంది: NSE MD

image

భారత్ సంపద మరో 50ఏళ్లలో 10రెట్లు (1000%) పెరుగుతుందని NSE ఎండీ ఆశీష్ కుమార్ అంచనా వేశారు. యువత ద్వారా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వీస్ సెక్టార్ భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్యం, రవాణాకు సంబంధించి దేశం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.

News June 20, 2024

NEETపై సీబీఐతో విచారణ జరిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ‘నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.