News April 9, 2026

పిల్లలను ట్యూషన్‌కు పంపుతున్నారా?

image

పిల్లలందరికీ ట్యూషన్ అవసరం లేదు కానీ పేరెంట్స్ పర్యవేక్షణ ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ‘చదువులో కాన్ఫిడెంట్‌గా ఉంటూ రాణిస్తుంటే ట్యూషన్ పేరుతో మరో భారం వద్దు. అవసరం లేకపోయినా పంపితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మెంటల్ ప్రెజర్ పెరుగుతుంది. చదువు బోర్ కొడుతుంది. ఆడుకునే సమయం తగ్గిపోవడం వల్ల ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండలేరు. ఇంట్లో సరైన గైడెన్స్ లేకపోతే ట్యూషన్ అవసరం’ అని చెబుతున్నారు.

News April 9, 2026

‘హార్ముజ్’పై ఇరాన్ కీలక ప్రకటన!

image

హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాల నౌకలను అడ్డుకునేందుకు IRGC ఏర్పాటుచేసిన సీమైన్స్ బారిన షిప్పులు పడకుండా ఈ ప్రకటన చేసినట్లు తెలిపింది. ‘టెహ్రాన్ టోల్ బూత్’ కారిడార్ అని పిలిచే ఖేష్మ్, లారక్ దీవుల సమీపం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పేర్కొంది.

News April 9, 2026

గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

image

TG: గొంతులో మాంసం ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ శివారు పిల్లిగుండ్లతండాకు చెందిన బానోతు బిచ్చా(54) తన ఇంట్లో దుర్గమ్మ పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో రాత్రి భోజనం చేస్తున్న సమయంలో గొంతులో మాంసపు ముక్క ఇరుక్కుంది. ఊపిరాడక విలవిల్లాడిన బిచ్చాను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

News April 9, 2026

మరో వివాదంలో ధురంధర్-2!

image

సునామీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధురంధర్-2ను <<19529183>>వివాదాలు<<>> వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో తమ అనుమతి లేకుండా ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ సాంగ్‌ను వాడుకున్నారంటూ త్రిమూర్తి ఫిల్మ్స్ ముంబై కోర్టును ఆశ్రయించింది. 1989లో వచ్చిన ‘త్రిదేవ్’లోని ఆ పాట హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఈ సాంగ్‌‌ను ‘ధురంధర్’ నుంచి తొలగించాలని, లేదంటే నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. త్వరలోనే ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

News April 9, 2026

భూమి, చంద్రుడి HD ఫొటోలు

image

‘ఆర్టెమిస్-2’ ప్రయోగంలో భాగంగా అంతరిక్షం నుంచి తీసిన చంద్రుడు, భూమి హైక్వాలిటీ ఫొటోలను నాసా విడుదల చేసింది. బూడిద రంగులో జాబిల్లి కనువిందు చేస్తుండగా, భూమి నెలవంక అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో ఉన్నారు.

News April 9, 2026

విద్యార్థులకు అలర్ట్.. ఆధార్ అప్డేట్ కోసం స్పెషల్ క్యాంపులు

image

AP: ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు, రెండో విడతలో ఈ నెల 21 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12.09 లక్షల మంది తమ డేటాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.

News April 9, 2026

ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. వసూలుకు ఇరాన్ ప్లాన్

image

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున ఫీజు విధించాలని ప్లాన్ చేస్తోందని Financial Times తెలిపింది. క్రిప్టోకరెన్సీలో పేమెంట్స్ తీసుకోవాలని అనుకుంటోందని చెప్పింది. జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించే ముందు ట్యాంకర్‌లోని సరకులను పరిశీలించనుందని అక్కడి అధికారులు చెప్పినట్లు వెల్లడించింది.

News April 9, 2026

విద్యార్థులకు పాలు.. రూ.120 కోట్ల ఆర్డర్

image

TG: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌, పాలను ప్రభుత్వం అందజేయనుంది. ఇందులో భాగంగా పాల సరఫరా కోసం విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో స్కూళ్లు తెరిచేనాటికి 150-200ML టెట్రా ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతామని డెయిరీ అధికారులు వెల్లడించారు. కాగా వారానికి 3 రోజులు పాలు, మూడు రోజులు రాగి జావను ప్రభుత్వం అందించనుంది.

News April 9, 2026

టీవీ యూజర్లకు యూట్యూబ్ షాక్!

image

TV యూజర్లకు షాక్ ఇచ్చేందుకు యూట్యూబ్ రెడీ అవుతోంది. టీవీల్లో స్కిప్ చేసేందుకు వీలు లేకుండా 90 సెకన్లపాటు Unskippable యాడ్స్ వేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని టెస్ట్ చేస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. యూజర్లను ప్రీమియం వైపు మళ్లించి, రెవెన్యూ పెంచుకునే చర్యల్లో భాగంగా యూట్యూబ్ ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. మరోవైపు జియో హాట్ స్టార్ సహా పలు OTT యాప్స్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి.

News April 9, 2026

ఎర్రటి ఎండలో YS పాదయాత్ర.. గుర్తు చేసుకున్న జగన్

image

AP: YSR పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు అయిన సందర్భంగా జగన్ గుర్తు చేసుకున్నారు. ‘నాకు బాగా గుర్తు APR 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో ధైర్యం నింపింది. నాన్నకు రాష్ట్రమంతా మద్దతుగా నిలిచి CMని చేసింది. సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయి’ అని ట్వీట్ చేశారు.