India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను TTD తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో లేఖలతో వచ్చిన భక్తుల పరిస్థితి అయోమయంగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో భక్తులు లేఖలతో శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. USలోని బోస్టన్‌లో పర్యటిస్తున్న ఆయన అక్కడ ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ‘భారత ఎన్నికల కమిషన్ రాజీపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండినవారి కంటే పోలైన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అది అసాధ్యం. పోలింగ్ కేంద్రాల్లోని వీడియో ఫుటేజ్ చూసే వీల్లేకుండా చట్టాన్ని కూడా మార్చేశారు’ అని వ్యాఖ్యానించారు.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 518 పాయింట్ల లాభంతో 79,071, నిఫ్టీ 138 పాయింట్ల ప్లస్‌లో 23,989 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లాభాల్లో ట్రేడవుతోంది. ఒరాకిల్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, హిండ్ కాపర్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్‌గా, లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీ విడుదల తేది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
చరిత్రలో ఎన్నో దేశాలు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. వాటిల్లో నేపాల్ ఒకటి. కానీ మళ్లీ రాచరిక పాలనే కావాలని కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. చివరి హిందూ రాజు జ్ఞానేంద్ర షా తప్పుకోవడంతో 2008లో నేపాల్ సెక్యులర్ దేశంగా అవతరించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వ అవినీతి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం జనాగ్రహానికి దారితీశాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 7 గంటల సమయం పడుతోంది. అటు రెండో జ్యోతిర్లింగం శ్రీశైలంలోనూ భక్తులు కిటకిటలాడుతున్నారు. లాంగ్ వీకెండ్‌కు నేడు సోమవారం తోడు కావడంతో మల్లన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా రద్దు చేసి స్పర్శ దర్శనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. స్వామిని చూడాలంటే క్యూలైన్లలో మూడు గంటలు పడుతోంది.
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్‌పానియా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతడిపై రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనాస్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా మొత్తం ఏడుగురిపై వేటు వేసింది. క్రీడాకారులు డోపింగ్ టెస్టులకు శాంపిల్స్ ఇవ్వకుండా రమేశ్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం నాడా ఈ చర్యలు చేపట్టింది. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేసేవారిని ప్రోత్సహించలేదని రమేశ్ తెలిపారు.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘HIT-3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే USAలో బుకింగ్స్ ప్రారంభం కాగా ఇప్పటివరకు $75K వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుండగా, 10 రోజుల ముందే ఈ ఫీట్‌ను సాధించింది. దీంతో నాని కెరీర్‌లో అత్యంత వేగంగా $75K మార్కును చేరుకున్న సినిమాగా నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ రికార్డునూ సాధించనుంది.
TG: మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గిపోయాయి. HYD మలక్‌పేట్ మార్కెట్‌లో క్వింటాల్ ₹1200 ఉండగా, కనిష్ఠంగా ₹500 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో గత నెలలో కిలో ₹40 వరకు ఉన్న ధర ఇప్పుడు ₹15కు పడిపోయింది. యాసంగి దిగుబడి మరింతగా పెరగడంతో ఈ నెలాఖరుకు మరింత ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు తమకు ఆదాయం లేక నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో ధర ఎంత ఉంది?
Sorry, no posts matched your criteria.