News January 11, 2025

అంతర్జాతీయ క్రికెట్‌కు తమీమ్ ఇక్బాల్ మళ్లీ వీడ్కోలు

image

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు మరోసారి వీడ్కోలు పలికారు. తన ఫేస్‌బుక్ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఆయన 2023, జులై 6న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించారు. అప్పటి దేశ ప్రధాని హసీనా విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈసారి మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిగా వీడుతున్నట్లు స్పష్టం చేశారు.

News January 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 11, 2025

శుభ ముహూర్తం (11-01-2025)

image

✒ తిథి: శుక్ల ద్వాదశి ఉ.8:06 వరకు
✒ నక్షత్రం: రోహిణి మ.12.28 వరకు
✒ శుభ సమయాలు ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.24-7.36
✒ వర్జ్యం: సా.5.51-7.22
✒ అమృత ఘడియలు: ఉ.9.20-10.59, రా.3.06-4.37

News January 11, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 11, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.16 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 11, 2025

ఊరెళ్లే జనాలతో రద్దీగా మారిన హైదరాబాద్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్ల జనాలతో హైదరాబాద్‌ రద్దీగా మారింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలు కానుండటంతో ప్రజలు స్వస్థలాలకు బయల్దేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా నగరంలో రద్దీ కొనసాగనుంది.

News January 11, 2025

TODAY HEADLINES

image

* మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్
* అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
* అమ్మాయిల జోలికి వస్తే తొక్కి నార తీస్తా: పవన్
* కేటీఆర్‌పై మరో కేసు నమోదు
* సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు
* రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్
* తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు

News January 11, 2025

BREAKING: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం

image

TG: MBNR జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అది చూసి వెనకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. కాగా ఇవాళ ఉదయం సూర్యాపేట-ఖమ్మం హైవేపై జరిగిన <<15112586>>ఘటనలో<<>> నలుగురు మరణించారు.

News January 11, 2025

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500-3500 మందికి ఏడుగురు, 3501 నుంచి ఆపై జనాభాకు 8 మంది ఉండేలా సచివాలయ ఉద్యోగులను విభజిస్తారు. దీని ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

News January 11, 2025

APలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విభజన ఇలా

image

మల్టీపర్పస్ ఫంక్షనరీస్- పంచాయతీ సెక్రటరీ, డిజిటల్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, వార్డు అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి

టెక్నికల్ ఫంక్షనరీస్- VRO, ANM, సర్వే, ఎనర్జీ, ఇంజినీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్, వెటర్నరీ సెక్రటరీ, రెవెన్యూ, వార్డు హెల్త్, ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, శానిటేషన్, ఎనర్జీ సెక్రటరీ

News January 11, 2025

జాబ్ చేయాలా? జబ్బు పడాలా?

image

ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T చీఫ్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన చెప్పినట్లు పని చేస్తే ఉద్యోగిపై శారీరకంగానే కాకుండా మానసికంగానూ ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషులు 55 గంటలు, మహిళలు 40 గంటలకుపైగా పని చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్, ఒబెసిటీతో పాటు మరికొన్ని వ్యాధులు వస్తాయంటున్నారు. అవిశ్రాంతంగా పని చేయడం మంచిది కాదని చెబుతున్నారు.