India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ వారంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి ముగింపు పలకొచ్చని US ప్రెసిడెంట్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన SM ప్లాట్‌ఫామ్ ట్రూత్‌సోషల్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. యుద్ధం ఆగితే రెండు దేశాలు USతో భారీ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు. కాల్పుల విరమణ, ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యాకు అప్పగించడం తదితర అంశాలను శాంతి ఒప్పందంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
కర్ణాటక మాజీ DGP ఓమ్ ప్రకాశ్(68) <<16162944>>హత్య <<>>కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘‘ప్రకాశ్, ఆయన భార్య పల్లవి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. నిన్న ఆయనను ఆమె పొడిచి చంపింది. ఆ తర్వాత తన ఫ్రెండ్, Ex IPS అధికారి భార్యకు కాల్ చేసి ‘ఆ రాక్షసుణ్ని చంపేశాను’ అని చెప్పింది. పల్లవిని, ఆమె కూతురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
TG: ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి 3 రోజులు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సా.4 గంటల నుంచి బుధవారం సా.6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అలాగే కౌంటింగ్ జరిగే ఈ నెల 25న కూడా వైన్స్ క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు.
పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ ఉద్యోగులతో ప్రధాని మోదీ ఈరోజు భేటీ కానున్నారు. పలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అద్భుతమైన కృషి చేసిన ఉద్యోగులను పురస్కారాలతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు పుస్తకాలను మోదీ ఆవిష్కరిస్తారు.
TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రభుత్వం 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను (AE) నియమించనుంది. వచ్చే నెల నుంచి వీరు విధుల్లో చేరనున్నారు. ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం 4 దశల్లో రూ.5లక్షలు అందించనుండగా, ఇంటి నిర్మాణాన్ని బేస్‌మెంట్ వరకు పూర్తి చేసిన వారికి తొలుత రూ.లక్ష జమ చేస్తారు. అయితే ఏఈలు ఆ ఇళ్ల బేస్‌మెంట్‌లను పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాతే డబ్బు ఖాతాల్లో జమ అవుతుంది.
IPLలో CSK ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న MI చేతిలో పరాజయంతో ప్లేఆఫ్స్ అవకాశాన్ని కష్టతరం చేసుకుంది. 8 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మిగతా 6 మ్యాచ్‌లు భారీ మెజార్టీలతో గెలిచి నెట్ రన్ రేటును మెరుగుపర్చుకుంటేనే ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యమని విశ్లేషకుల అంచనా. రాజస్థాన్ రాయల్స్‌దీ ఇదే పరిస్థితి. ఇకపై ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడాలి.
AP: ఆహారాలు, నిత్యావసరాల్లో కల్తీని గుర్తించేందుకు రాష్ట్రంలో రెండు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ల్యాబ్ విశాఖ KGHలో ఇప్పటికే సిద్ధమైంది. మరోటి తిరుమలలో ఏర్పాటు కానుంది. ఒక్కో ల్యాబ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. కేజీహెచ్ ల్యాబ్‌కు సంబంధించి ఇప్పటికే భవన నిర్మాణం పూర్తయింది. యంత్రాలనూ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.
APలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి కొత్త సిలబస్ ప్రకారమే విద్యాశాఖ పరీక్షలు నిర్వహించనుంది. 3 నుంచి పదో తరగతి స్థాయిలోనే ఆబ్జెక్టివ్ విధానంలో 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉండదు. DSCకి 80%, టెట్‌కి 20% వెయిటేజీ ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు ఉంటాయనే పూర్తి వివరాలను <
AP: ఎండల తీవ్రత దృష్ట్యా జనవాణి వేళల్లో మార్పులు చేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా జనవాణి కింద ప్రజా సమస్యలపై జనసేన అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతున్న విషయం తెలిసిందే.
TG: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ <<16153019>>పోచంపల్లిలో<<>> పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్’ పేరుతో మే 15న అక్కడ నిర్వహించనున్న కార్యక్రమంలో ఇక్కత్ పట్టుచీరలు ధరించి ర్యాంప్‌వాక్ చేయనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాల స్టాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.