News April 21, 2025

త్వరలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

image

TG: 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామానికి మొబైల్ వాహనాలను పంపి పరీక్షలు నిర్వహించనుంది. లక్షణాలు బయటపడితే చికిత్స అందించనుంది. తొలి దశలో భద్రాద్రి, ఆదిలాబాద్, MBNR, సంగారెడ్డి, KNR జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

News April 21, 2025

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

image

CSKతో జరిగిన మ్యాచ్‌లో రాణించిన రోహిత్ శర్మ(76*) అరుదైన రికార్డును సాధించారు. IPLలో అత్యధిక(20) POTMలు సాధించిన భారత ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ABD(25), గేల్(22) తొలి రెండు స్థానాల్లో, కోహ్లీ(19) ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. అలాగే IPLలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ధవన్(6,769)ను వెనక్కు నెట్టి 6,786 పరుగులతో హిట్ మ్యాన్ రెండో స్థానానికి చేరారు. కోహ్లీ(8,326) టాప్‌లో ఉన్నారు.

News April 21, 2025

దేశవ్యాప్త సమ్మెకు LPG డిస్ట్రిబ్యూటర్ల పిలుపు

image

తమ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించకపోతే దేశవ్యాప్త సమ్మె చేస్తామని LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కేంద్రాన్ని హెచ్చరించింది. నిర్వహణ వ్యయం అధికమైనందున 14.2KG సిలిండర్‌కు ఇస్తున్న ₹73.03 కమీషన్‌ను ₹150కి పెంచాలని డిమాండ్ చేసింది. ఉజ్వల స్కీమ్‌లోని సిలిండర్ల పంపిణీలో సమస్యలున్నాయని, ఆయిల్ కంపెనీల టార్గెట్లనూ భరించలేకపోతున్నామని పేర్కొంది. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపింది.

News April 21, 2025

వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

image

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.

News April 21, 2025

రేపే ఇంటర్ ఫలితాలు

image

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్క్స్ లిస్ట్‌ను ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

News April 21, 2025

26న ఎచ్చెర్లకు సీఎం.. వేట నిషేధ భృతికి శ్రీకారం

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. మత్స్యకారులకు రూ.20వేల చొప్పున చేపల వేట నిషేధ భృతిని అందజేస్తారు. తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. కాగా సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా భృతిని అందజేస్తోంది.

News April 21, 2025

నేటి నుంచి 57 నగరాల్లో కాంగ్రెస్ ప్రెస్‌మీట్లు

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ED ఛార్జిషీట్ ఫైల్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ‘కాంగ్రెస్ నిజాలు, బీజేపీ అబద్ధాలు’ క్యాంపెయిన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామంది. దేశంలోని 57 నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్‌మీట్లు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సిటీస్, నేతల పేర్లతో జాబితా విడుదల చేసింది.

News April 21, 2025

చమురు దిగుమతుల ఖర్చు ₹13.76L Cr

image

FY25లో భారత్ 24.24 కోట్ల టన్నుల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. దీని విలువ ₹13.76 లక్షల కోట్లు. FY24తో పోలిస్తే 4.2% ఎక్కువ. మొత్తం దేశీయ చమురు అవసరాల్లో 89.1% దిగుమతుల ద్వారానే రావడం గమనార్హం. ఇదే సమయంలో దేశీయ చమురు ఉత్పత్తి 2.94 కోట్ల టన్నుల నుంచి 2.87 కోట్ల టన్నులకు తగ్గింది. గ్యాస్ దిగుమతి 15.4% పెరిగి 3,666MMSCM(మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్)కు చేరింది.

News April 21, 2025

IPL: ఇవాళ కీలక పోరు

image

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.