News April 21, 2025

IPL కోసం మటన్, పిజ్జాకు వైభవ్ దూరం: కోచ్

image

RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మటన్, పిజ్జా అంటే చాలా ఇష్టమని కోచ్ మనీశ్ వెల్లడించారు. గతంలో ఎంత పెట్టినా మిగిల్చేవాడు కాదని, అందుకే బొద్దుగా ఉన్నాడని తెలిపారు. IPLలో బరిలో దిగడం కోసం వాటికి దూరంగా ఉండిపోయాడన్నారు. అతనికి బ్రియాన్ లారా అంటే ఇష్టమని చెప్పారు. లారాతోపాటు యువరాజ్ మిక్సింగ్‌లా సూర్యవంశీ కనిపిస్తాడని పేర్కొన్నారు. అతను తప్పకుండా ఎక్కువకాలం క్రికెట్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.

News April 21, 2025

కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్‌స్కీ

image

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్‌ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.

News April 21, 2025

IPL రోబోటిక్ డాగ్ పేరు ఏంటంటే?

image

ఐపీఎల్‌లో కనిపిస్తున్న రోబోటిక్ డాగ్‌(కెమెరా)కు పేరు పెట్టారు. ఇటీవల నిర్వహించిన పోల్‌లో మెజారిటీ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ‘చంపక్’ అని పేరు పెట్టినట్లు IPL అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ‘మీట్ చంపక్’ అని రాసుకొచ్చింది. ఆటగాళ్లతోనూ, చీర్ లీడర్స్‌తోనూ ఈ రోబోటిక్ డాగ్ సందడి చేసిన వీడియోలు వైరలయ్యాయి.

News April 21, 2025

‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

image

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్‌గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్‌ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్‌కు ఎంపీ రిప్లై ఇచ్చారు.

News April 21, 2025

ఈ వారంలో ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్: నాగవంశీ

image

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ మూవీపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 21, 2025

ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు

image

✒ 1910: ప్రముఖ US రచయిత మార్క్ ట్వెయిన్ మరణం
✒ 1938: ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ మరణం
✒ 1939: తెలుగు రంగస్థల నటుడు భాను ప్రకాశ్ జననం
✒ 2000: బాలీవుడ్ నటి నిగర్ సుల్తానా మరణం
✒ 2013: గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం(ఫొటోలో)
✒ 2022: రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావు మరణం
✒ నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం

News April 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 21, 2025

MBBS పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్.. 12 మందిపై వేటు?

image

AP: విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన MBBS పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ అంశంపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో కాలేజీ సూపరింటెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు క్లర్క్‌లపై చర్యలకు వారు సిఫార్సు చేశారు. త్వరలోనే ఆ 12 మందిపై వేటు వేసే అవకాశం ఉంది.

News April 21, 2025

రోహిత్ ఫామ్‌లో ఉంటే గేమ్ నుంచి ప్రత్యర్థి ఔట్: హార్దిక్

image

రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MI కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశారు. అతను మంచి టచ్‌లోకి వస్తే ప్రత్యర్థి టీమ్ గేమ్ నుంచి ఔటైపోతుందని వ్యాఖ్యానించారు. CSKతో మ్యాచ్‌లో హిట్ మ్యాన్, సూర్య భాగస్వామ్యంతో విజయం తమవైపు వచ్చిందని చెప్పారు. తమ బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారని కొనియాడారు. కాగా CSKపై రోహిత్ 76* రన్స్ చేసిన విషయం తెలిసిందే.

News April 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.