News June 16, 2024

బక్రీద్‌కు జంతువధ నిషేధం అర్థరహితం: హైకోర్టు

image

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విశాల్‌గఢ్ కోట వద్ద బక్రీద్‌కు జంతువధను ఆ రాష్ట్ర సర్కారు నిషేధించడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ఆ నిర్ణయం అర్థరహితమైనదని తేల్చిచెప్పింది. కోట రక్షిత కట్టడాల జాబితాలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించగా.. మరి ఇన్నేళ్లూ ఏం చేశారంటూ ప్రశ్నించింది. ముస్లింలు బహిరంగంగా కాక.. ప్రైవేటు భూముల్లో యథేచ్ఛగా పండుగ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.

News June 16, 2024

త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!

image

డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా అన్ని పార్టీల నుంచి దీనిపై ఏకాభిప్రాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. యూట్యూబ్‌ సహా వివిధ ఆన్‌లైన్ వేదికల్లో వీడియోల నియంత్రణకూ చట్టం తీసురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News June 16, 2024

బలవంతంగా రాజీనామా చేయించారు.. మళ్లీ తీసుకోండి: వాలంటీర్లు

image

AP: ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు యూటర్న్ తీసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశామని, తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వారు తమ MLAలను కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. YCP నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాపోతున్నారు. కాగా ఎన్నికల ముందు 1.08 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News June 16, 2024

వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్

image

AP: ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి ఫైలుపై సంతకం చేశారు. అంతకుముందు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.

News June 16, 2024

కోచ్‌గా గంభీర్ ఖరారు.. నెలాఖరున అనౌన్స్?

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరు నాటికి బీసీసీఐ ఆయన పేరును అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ద్రవిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా భారత హెడ్ కోచ్ పదవికి దాదాపు 3,000 దరఖాస్తులు వచ్చినా బీసీసీఐ మాత్రం గంభీర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

News June 16, 2024

ప్రపంచం అంతమైనా ఈ 5 జీవులు బతికేస్తాయట!

image

ఏదైనా ప్రళయమొచ్చి జీవరాశి నామరూపాలు లేకుండా పోయినా ఓ ఐదు జీవులు మాత్రం బతికేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టార్టిగ్రేడ్‌ ఆహారం, ఆక్సిజన్, నీళ్లు లేకుండా బతికేస్తుంది. బొద్దింకలు విష పదార్థాలు, రేడియేషన్‌ను తట్టుకుని జీవిస్తాయి. రాబందులు విపత్తులో మరణించిన జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. షార్క్ చేపలు విపత్తును తట్టుకుని జీవించగలవు. ఎంపరర్ పెంగ్విన్లు కూడా నిక్షేపంగా బతికేస్తాయి.

News June 16, 2024

టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం: నారాయణ

image

AP: రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు. దేశంలో టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో 32వేల ఎకరాలను ఎలాంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని చెప్పారు. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 16, 2024

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వెల్లడించింది.

News June 16, 2024

పవిత్ర గౌడను దర్శన్ పెళ్లి చేసుకోలేదు: దర్శన్ లాయర్

image

అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడకు పెళ్లి కాలేదని దర్శన్ లాయర్ అనిల్ తెలిపారు. వారిద్దరూ పార్టనర్స్ కాదని, క్లోజ్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘దర్శన్ రెండో పెళ్లి చేసుకోలేదు. రేణుకా స్వామి హత్యతో ఆయనకు సంబంధం లేదు. క్రైమ్ జరిగిన చోట ఆయన కారు ఉన్నట్లు CCTV ఫుటేజ్ చూపిస్తోంది. కానీ ఆ కారులో ఆయన లేరు. పోలీసులు ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు’ అని మీడియాకు వివరించారు.

News June 16, 2024

నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు: మంత్రి రాజనర్సింహ

image

TG: నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా రోజుకు 180-200 ఫుడ్ శాంపిల్స్‌లను సేకరించి టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు, డెయిరీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీదారులు FSSAI లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.