News June 15, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..

image

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News June 15, 2024

ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్

image

ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.

News June 15, 2024

STSS.. లక్షణాలు ఇవే..

image

STSS <<13447403>>బ్యాక్టీరియా<<>> సోకినవారిలో హై ఫీవర్, BP పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ‘కొందరు పేషెంట్లలో ఉదయం వేళల్లో పాదానికి వాపు కనిపిస్తుంది. మధ్యాహ్నానికి అది మోకాలికి చేరుతుంది. తర్వాతి 48 గంటల్లోనే మరణించిన సందర్భాలున్నాయి’ అని టోక్యో ఉమెన్స్ వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వివరించారు.

News June 15, 2024

అమరావతి బాధ్యతను నాపై ఉంచారు.. అహర్నిశలు శ్రమిస్తా: నారాయణ

image

AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి డెవలప్‌మెంట్ బాధ్యతను తనపై ఉంచారని, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు.

News June 15, 2024

డేంజర్ బ్యాక్టీరియా.. 48 గంటల్లో మరణం

image

శరీరంలోని మాంసాన్ని తింటూ 48గంటల్లోనే మనిషిని చంపగలిగే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌(STSS) బ్యాక్టీరియా జపాన్‌లో కలకలం రేపుతోంది. ఈనెల 2 నాటికి 977 మందికి సోకగా, ఏడాది చివరికి 2500మందికి వ్యాపించొచ్చని అధికారులు తెలిపారు. మనిషి శరీరంలోనే జీవించే ఈ బ్యాక్టీరియా చర్మవ్యాధులు, గాయాలు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు రక్తనాళాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పరిశుభ్రతతో దీన్ని అడ్డుకోవచ్చు.

News June 15, 2024

దేశవ్యాప్త నిరసనలకు AISA పిలుపు

image

నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఈనెల 19,20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(AISA) పిలుపునిచ్చింది. పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది. నీట్ ఫలితాల్లో 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించగా ఇందులో హరియాణాలోని ఓ కోచింగ్ సెంటర్‌‌కు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీంతో పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

News June 15, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని టీటీడీ పంపిణీ చేస్తోంది.

News June 15, 2024

క్లీంకార బుడిబుడి అడుగులు

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు నిన్న 12వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా కపుల్స్‌కి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్పెషల్ విషెస్ చెప్పారు. వారికి థాంక్స్ చెబుతూ భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో కలిసున్న క్యూట్ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. అందులో చరణ్ దంపతులు క్లీంకారతో బుడిబుడి అడుగులు వేయిస్తున్నట్లు ఉంది.

News June 15, 2024

ఆమె విజయం.. కన్నతండ్రికి గర్వకారణమైంది

image

కన్నబిడ్డలు ప్రయోజకులైతే తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేనిది. తల్లిదండ్రులకు మించి సక్సెస్ సాధిస్తే అంతకుమించిన గర్వకారణం ఉండదు. తాజాగా తెలంగాణకు చెందిన IPS అధికారి వెంకటేశ్వర్లు కూతురు తండ్రిని మించిన తనయగా అందరి దృష్టి ఆకర్షించారు. ట్రైనీ IAS అయిన ఉమాహారతి పోలీస్‌ అకాడమీకి రాగా అక్కడే డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కూతురికి సెల్యూట్ చేశారు. ఈ దృశ్యం అందరి మనసును తాకింది.

News June 15, 2024

ఇదే నా చివరి T20 WC: బౌల్ట్

image

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పే తనకు చివరిదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నారు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక ఇతర ఫార్మాట్లలో కొనసాగుతారా? అనేదానిపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. 34 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న బౌల్ట్ ఈ WCలో 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశారు. కానీ కివీస్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.