News June 15, 2024

INDvCAN: టాస్ ఆలస్యం

image

ఇండియా, కెనడా మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం ఏర్పడింది. ఫ్లోరిడాలో భారీ వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో టాస్ ఆలస్యమవుతోంది. మ్యాచ్ అంపైర్లు రాత్రి 8 గంటలకు మరోసారి పిచ్‌ను పరిశీలించి టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

News June 15, 2024

బాలికపై హత్యాచారం.. సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్

image

TG: ఆరేళ్ల బాలిక <<13437328>>హత్యాచార<<>> ఘటనను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని పెద్దపల్లి కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఇప్పటికే డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు.

News June 15, 2024

ఫుట్‌బాల్ లెజెండ్ కెవిన్ కాంప్‌బెల్ మృతి

image

యూకే ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కాంప్‌బెల్(54) మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ మాజీ ప్లేయర్ కెవిన్ మరణ వార్త కలిచివేసిందని పేర్కొంది. 1988లో తన కెరీర్‌ను ప్రారంభించిన కెవిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా తన కెరీర్‌లో 148 గోల్స్ చేశారు.

News June 15, 2024

దేశానికి ఇందిర అమ్మవంటివారు: సురేశ్ గోపీ

image

మాజీ పీఎం ఇందిరాగాంధీ దేశానికి అమ్మవంటివారని బీజేపీ ఎంపీ సురేశ్ గోపి పేర్కొన్నారు. కేరళ మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్టు నేత ఈకే నాయనార్లు తన రాజకీయ గురువులని తెలిపారు. బీజేపీకి చెందిన ఆయన కాంగ్రెస్, సీపీఎం నేతల్ని పొగడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాగా.. తన మాటలకు రాజకీయాలను ఆపాదించొద్దంటూ సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆయన కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

News June 15, 2024

FLASH: ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం

image

TG: వైద్య ఆరోగ్యశాఖలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

News June 15, 2024

అధికారం ఉందని కక్ష సాధింపులు చేయవద్దు: చంద్రబాబు

image

AP: కూటమి విజయం కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ఎవరు, ఎక్కడ ఏం చేశారో చూసి పదవులు ఇస్తాం. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు’ అని పార్టీ కార్యకర్తలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

News June 15, 2024

అంచనాల్లేకుండా వచ్చి సంచలనం రేపారు!

image

టీ20 వరల్డ్ కప్ మొదలవడానికి ముందు USA, నేపాల్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్ జట్లు కనీసం పోటీలో ఉంటాయని కూడా ఎవరూ భావించలేదు. అలాంటిది వీటిలో అమెరికా, అఫ్గాన్ సూపర్-8కు దూసుకెళ్లాయి. ఇక సౌతాఫ్రికాను నేపాల్ దాదాపు ఓడించినంత పనిచేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఉన్న గ్రూప్-బిలో స్కాట్లాండ్ 2వ స్థానంలో ఉంది. దీంతో ఈ జట్లు పసికూనల్లా కాక కసితో ఆడుతున్నాయంటూ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తోంది.

News June 15, 2024

గుజరాత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమపై కేంద్రమంత్రి విమర్శలు

image

గుజరాత్‌లో USకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న తీరును కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తప్పుపట్టారు. కల్పించే ప్రతీ ఉద్యోగానికి సగటున ఈ సంస్థ రూ.3.2కోట్ల సబ్సిడీ పొందనుందన్నారు. ‘5వేల ఉద్యోగాలు తెచ్చే ఈ కొత్త యూనిట్‌కు $2 బిలియన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇది కంపెనీ పెట్టుబడిలో 70% కంటే ఎక్కువ. ఇలాంటి పెట్టుబడులు భారత్‌కు అవసరమా అని అనిపించింది’ అని తెలిపారు.

News June 15, 2024

YCP ట్వీట్‌‌పై AP FACT CHECK

image

జగన్ ప్రభుత్వం నిర్వహించిన స్పందన పోర్టల్‌ని కొత్త ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయం తీసుకుందని వైసీపీ చేసిన ట్వీట్‌‌పై ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వివరణ ఇచ్చింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి 2015లో ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం’ ను ప్రవేశ పెట్టారు. YCP ట్వీట్ అవాస్తవం’ అని పేర్కొంది.

News June 15, 2024

విశాఖ స్టీల్ హోం డెలివరీ!

image

స్టీల్ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్టీల్‌ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్(RINL) వెబ్‌సైట్‌లో <>ఈ-సువిధ<<>> పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఇందులో లాగిన్ అయి స్టీల్‌ బుక్ చేసుకోవచ్చు. కాగా ఈ ప్లాంట్‌‌ను కేంద్రం ప్రైవేటీకరిస్తుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి.