News March 26, 2024

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన లోక్‌సభ స్థానాల భర్తీపై అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. సీఎం ఒక్కరే హస్తిన పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలోని మొత్తం 17 MP స్థానాలకు గానూ తొమ్మిదింటికి అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసే ఏడో జాబితాలో మిగతా పేర్లను ప్రకటించనున్నారు.

News March 26, 2024

తస్మాత్ జాగ్రత్త.. నమ్మి మోసపోకండి: పోలీసులు

image

TG: మ్యాట్రిమోని సైట్లు, సోషల్ మీడియా యాప్స్‌లలో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొఫైల్ చూసి నమ్మి మోసపొవద్దని సూచిస్తున్నారు. ‘ఇలాంటి వేదికల్లో పరిచయమైన వారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్‌లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది’ అని ట్వీట్ చేశారు.

News March 26, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు విచారణ

image

లిక్కర్ స్కామ్ కేసులో తన రిమాండును సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఉదయం 10.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఈ నెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.

News March 26, 2024

ఆటగాడిని చెత్తతో పోల్చిన మాజీ క్రికెటర్.. స్పందించిన RCB

image

నిన్న PBKSతో మ్యాచ్ సందర్భంగా RCB బౌలర్‌ యశ్ దయాల్‌పై కామెంటేటర్ మురళీ కార్తీక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఒకరి చెత్త.. మరొకరికి నిధిలా మారుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ అంశంపై RCB స్పందిస్తూ.. ‘అవును.. అతను మా నిధే’ అని రిప్లై ఇచ్చింది. గత సీజన్‌లో GT తరఫున ఆడిన దయాల్ ఓవర్లో రింకూ సింగ్(KKR) 5 సిక్సులు బాదిన విషయం తెలిసిందే.

News March 26, 2024

రేపు ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్

image

టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న రొమాంటిక్ క్రైమ్ కామెడీ ‘టిల్లు స్క్వేర్’ ఈనెల 29న రిలీజ్ కానుంది. ఈక్రమంలో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రేపు టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.

News March 26, 2024

రేపటి నుంచి రాష్ట్రంలో తీవ్ర ఎండలు

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఎండ తీవ్రత పెరుగుతుందని IMD తెలిపింది. రాబోయే నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వడగాలులు వీయడం వల్ల ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని అంచనా వేసింది.

News March 26, 2024

మోదీని ఇంటికి పంపేవరకు నిద్రపోం: ఉదయనిధి

image

మోదీ, BJPని ఇంటికి పంపేవరకూ నిద్రపోయేది లేదని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. DMKకి నిద్రలేని రాత్రులు వచ్చాయని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘గ్యాస్ సిలిండర్ 2014లో రూ.450 ఉంటే మీరు రూ.1,200 చేశారు. ఎన్నికలు రాగానే రూ.100 తగ్గించి డ్రామాలాడుతున్నారు. ఎన్నికలు ముగిస్తే సిలిండర్లపై మళ్లీ రూ.500 పెంచుతారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

News March 26, 2024

వరుణ్ గాంధీకి కాంగ్రెస్‌ ఆహ్వానం

image

బీజేపీ టికెట్ నిరాకరించడంతో భంగపడ్డ వరుణ్ గాంధీని కాంగ్రెస్ ఆహ్వానించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరీ ప్రకటన చేశారు. ‘వరుణ్ కాంగ్రెస్‌లోకి వస్తే సంతోషిస్తాం. అతను మంచి విద్యావేత్త. పారదర్శకత, గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉండటం వల్లే బీజేపీ వరుణ్‌కు సీటు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. కాగా వరుణ్ తల్లి మేనకా గాంధీ మరోసారి సుల్తాన్‌పుర్ నుంచి బరిలో దిగేందుకు BJP అవకాశం ఇచ్చింది.

News March 26, 2024

పతిరణకు చోటు దక్కేనా!

image

తొలి విజయంతో ఊపుమీదున్న CSK ఇవాళ గుజరాత్‌తో తలపడనుంది. ఈ మేరకు తుది జట్టు కూర్పుపై కసరత్తు చేస్తోంది. పేసర్ పతిరణ జట్టుతో కలవడం, మొదటి మ్యాచ్‌లో ముస్తాఫిజర్ 4 వికెట్లతో అదరగొట్టడంతో ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. గత సీజన్ ట్రోఫీ విజయంలో పతిరణ కీలక పాత్ర పోషించారు. ఇక ఆర్సీబీ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న తుషార్ దేశ్ పాండే స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు ఛాన్స్ దక్కే అవకాశముంది.

News March 26, 2024

పంజాబ్‌లో బీజేపీ సింగిల్‌గానే!

image

పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుందని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ ఝక్కర్ ప్రకటించారు. శిరోమణి అకాలీ దళ్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోవట్లేదని.. మొత్తం 13 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అకాలీ దళ్, BJP మధ్య పొత్తు ఉండొచ్చని ప్రచారం సాగుతున్న వేళ ఈ ప్రకటన చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. కాగా జూన్ 1న పోలింగ్ జరగనుంది.