News April 21, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 21, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.56 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 21, 2025

శుభ సమయం(21-04-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ అష్టమి మ.1.49 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.8.02 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12; మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: మ.12.13-1.49 వరకు
✒ అమృత ఘడియలు: రా.9.38-11.14 వరకు

News April 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: తెలుగు ప్రజలకు రుణపడి ఉంటా: CBN
* ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
* TG: త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి
* ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి
* BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్
* IPL: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం

News April 21, 2025

కొల్హాపూర్, కామాఖ్యలో ఆలయాలను దర్శించుకున్న సూర్య దంపతులు

image

తమిళ నటుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ మహాలక్ష్మి, అస్సాంలోని కామాఖ్య ఆలయాల్లోని శక్తిపీఠాలను తాజాగా దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా.. సూర్య నటించిన రెట్రో వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 21, 2025

భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్.. కట్ చేస్తే..

image

UPలోని అలీగఢ్‌కు చెందిన షకీర్(40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్‌మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వాట్సాప్‌లో వీడియో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.

News April 21, 2025

IPL: ముంబై సునాయాస విజయం

image

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్‌మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్‌లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

News April 20, 2025

‘నాలా ఎవరూ మోసపోవద్దు’ అంటూ ఆత్మహత్య

image

AP: ఆన్‌లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి(మ) పైడేటికి చెందిన జయ చంద్ర కొన్నేళ్లుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పులపాలయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవద్దు. నాలాగా మోసపోవద్దు’ అని షర్టుపై రాసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. జయ చంద్ర డిగ్రీ చదివి, వ్యవసాయం, పాల వ్యాపారం చేస్తున్నాడు.

News April 20, 2025

జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

image

TG: జపాన్ పర్యటనలో భాగంగా పలు సంస్థలతో CM రేవంత్ బృందం పలు ఒప్పందాలు చేసుకుంది. HYDలో ఎకో టౌన్ ఏర్పాటులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో MOU చేసుకుంది. వీటితో HYDలో భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని CM విశ్వాసం వ్యక్తపరిచారు.

News April 20, 2025

విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు: కేశినేని చిన్ని

image

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

News April 20, 2025

రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ

image

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డును కోహ్లీ సమం చేశారు. ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన కోహ్లీ 19వ POTM అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(18 POTM) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా డివిలియర్స్(25) తొలి స్థానంలో ఉన్నారు.