News April 20, 2025

IPL: ముగిసిన సీఎస్కే బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే..

image

MIvsCSK మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. దూబే(50), జడేజా (53*) రాణించారు. ధోనీ 4 పరుగులకే ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, చాహర్, అశ్వని, శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై విజయ లక్ష్యం 177 రన్స్.

News April 20, 2025

IPL.. రికార్డు సృష్టించాడు

image

సీఎస్కే తరఫున బరిలోకి దిగిన యంగెస్ట్ ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే(17y 278d) రికార్డు నెలకొల్పారు. ముంబైతో జరుగుతున్న మ్యాచులో మాత్రే అరంగేట్రం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో అభినవ్ ముకుంద్(18y 139d), అంకిత్ రాజ్ పుత్(19y 123d), పతిరణ(19y 148d), నూర్ అహ్మద్(20y 79d) ఉన్నారు. ఓవరాల్‌గా IPLలో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ(14y 23d) ఉన్నారు.

News April 20, 2025

మాజీ డీజీపీ దారుణ హత్య

image

కర్ణాటక మాజీ DGP ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయనను భార్యే చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.

News April 20, 2025

నా పేరు తొలగింపుపై కోర్టుకెళ్తా: అజారుద్దీన్

image

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ HCA అంబుడ్స్‌మన్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండియా జట్టుకు 10ఏళ్లు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి <<16150970>>పేరు తొలగించమనటం<<>> సిగ్గుచేటని అన్నారు. తానేమి మూర్ఖుడని కాదని, స్టాండ్‌కు పేరు పెట్టె సమయానికే తన పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో పాల్గొననందుకే కొంతమంది అధికారులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 20, 2025

రేపు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

image

USA ఉపాధ్యక్షుడు JD వాన్స్ రేపటి నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 24 వరకు పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగనున్న ఆయనకు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్, చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శించనున్నారు. సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై వాన్స్ చర్చిస్తారు.

News April 20, 2025

‘చట్టాలన్ని ఆడవారికే’ .. భార్య టార్చర్‌తో భర్త సూసైడ్

image

భార్య వేధింపులు తాళలేక యూపీలో మోహిత్ కుమార్ అనే ఫీల్డ్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తినంతా భార్య వారి కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని, లేకుంటే తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలన్నీఆడవారికే అనుకూలంగా ఉన్నాయని, మగవారిని రక్షించేలా చట్టాలుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియో రికార్డు చేసి ప్రాణాలు వదిలారు.

News April 20, 2025

మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో కీలకంగా ఉన్న VFX కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వీటి కోసమే UV క్రియేషన్స్ రూ.75 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సోషియో ఫాంటసీ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల కానున్నట్లు సమాచారం.

News April 20, 2025

మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా: వైసీపీ

image

AP: మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ Xలో విమర్శించింది. ఇది మెగా డీఎస్సీ కాదు మెగా డిసప్పాయింట్‌మెంట్ అని మండిపడింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తారనే విషయమై స్పష్టత లేదని విమర్శించింది. ఈ మెగా డ్రామా పూర్తిగా పబ్లిక్ స్టంట్ అని దుయ్యబట్టింది.

News April 20, 2025

రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

image

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <>వడగాలులు <<>>వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరంలో-16, మన్యం-11, శ్రీకాకుళం-4 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 చోట్ల వడగాలులు వీస్తాయంది. ఇవాళ నంద్యాల(D) ఔకులో 42.6 డిగ్రీలు, తిరుపతి(D) వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీలు, నెల్లూరు(D) మనుబోలులో 42.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

News April 20, 2025

తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

image

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.