India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

*TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం
*నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10 వేలు: సీఎం రేవంత్
*420 హామీలతో ప్రజలను మోసం చేశారు: KTR
*గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN
*₹5,244Cr నష్టం.. తక్షణమే సాయం చేయాలని కేంద్రానికి ఏపీ నివేదిక
*AP: ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
*రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
*ప్రో కబడ్డీ లీగ్ విజేత దబాంగ్ ఢిల్లీ

విద్యార్థులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో తీర్చిదిద్దడంలో మరో ముందడుగు పడింది. ‘నేషనల్ AI ల్యాబ్’ ఏర్పాటుకు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ IBM, AICTE వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటుకానున్న ల్యాబ్ పరిశోధన, నైపుణ్యం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలువనుంది. 1000కి పైగా కోర్సుల ద్వారా 30M మందికి AI పరిజ్ఞానం అందనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తదుపరి తరాన్ని అందించడంలో ఇది దోహదపడనుంది.

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.

హిందువైన తన భార్య ఉష <<18155411>>క్రైస్తవంలోకి మారే <<>>ఛాన్స్ ఉందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తన భార్య క్రిస్టియన్ కాదని, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదని చెప్పారు. అయితే ఏదో ఒకరోజు తాను చూసినట్లే తన భార్య చూస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సువార్త నిజమని, అందరికీ మంచిదని క్రైస్తవం చెబుతుందని అన్నారు.

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్‌లో హాలోవీన్ వీకెండ్‌లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్‌లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్‌బర్న్ పోలీసులు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

TG: సుదీర్ఘ కాలానికి CONG అధికారంలోకి రావటంతో పదవులు ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. హైకమాండ్, CM రేవంత్ ఏదో రకంగా వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. ఆయనను ఎలా సంతృప్తిపరుస్తారనేది ఆసక్తికరం.

మొఘల్(16వ శతాబ్దం) కాలంలో బస్వాన్ అనే చిత్రకారుడు వేసిన ఓ పెయింటింగ్ రూ.120 కోట్లకు(13.6 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయింది. కొండలు, పచ్చిక బయళ్ల మధ్య చీతా ఫ్యామిలీ సేద తీరుతున్నట్లుగా ఉండే ఈ చిత్రాన్ని 29.8CM ఎత్తు, 18.6CM వెడల్పు ఫ్రేమ్‌పై గీశారు. తాజాగా ఆ పెయింటింగ్ లండన్‌లో జరిగిన క్రిస్టీ వేలంలోకి వచ్చింది. అంచనాకు మించి సుమారు 14 రెట్ల అధిక ధర పలికింది.

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్‌మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.

TG: బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తే వాతలు పెట్టాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.