News October 31, 2025

బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

image

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.

News October 31, 2025

రవితేజ ‘మాస్ జాతర’ రివ్యూ&రేటింగ్

image

గంజాయి ముఠాను సిన్సియర్ రైల్వే పోలీసు ఎలా అంతం చేశాడనేదే ‘మాస్ జాతర’ స్టోరీ. రవితేజ లుక్, ఎనర్జీ, ఫైట్స్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడ కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. BGM, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. రొటీన్ కమర్షియల్ స్టోరీ, కథలో బలం లేకపోవడం, ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే నిరాశ పరుస్తాయి. మధ్యమధ్యలో కొన్ని అనవసర సీన్లు చికాకు తెప్పిస్తాయి.
RATING: 2.5/5

News October 31, 2025

2018లోనే జెమీమా ప్రతిభను గుర్తించిన ENG మాజీ కెప్టెన్

image

మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో అద్భుతంగా రాణించిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేరు మార్మోగుతోంది. అయితే ఈమె స్టార్‌గా ఎదుగుతారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ 2018లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరలవుతోంది. ‘ఈ పేరు గుర్తుంచుకోండి.. జెమీమా రోడ్రిగ్స్. ఇండియాకు స్టార్‌గా మారుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ అంచనా నిజమైందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News October 31, 2025

Asia Cup: ఒకట్రెండు రోజుల్లో భారత్‌కు ట్రోఫీ!

image

ఆసియా కప్ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో ACC చీఫ్ నఖ్వీ అందజేసే అవకాశం ఉందని BCCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నవంబర్ 4న ICC మీటింగ్ ఉండటంతో ఆ లోపు ఇస్తారని అంచనా వేస్తోంది. మరోవైపు నెల రోజులవుతున్నా ట్రోఫీని ఇవ్వకపోవడం సరి కాదని BCCI సెక్రటరీ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అది ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ICC దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

News October 31, 2025

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

image

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>

News October 31, 2025

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

image

AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు RTC ఆస్పత్రులతోపాటు EHS హాస్పిటల్స్‌లోనూ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 JAN 1 తర్వాత రిటైరైన వారికి ఈ సౌకర్యం వర్తించనుంది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ₹38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు ₹51,429 ఓసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం చికిత్స పొందవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయింబర్స్‌మెంట్ సౌకర్యమూ ఉంటుంది.

News October 31, 2025

సత్య మూవీపై జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

image

సత్య(1998) మూవీ గురించి JD చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో తన క్యారెక్టర్‌ను చంపేయడం పెద్ద మిస్టేక్ అని డైరెక్టర్ వర్మ చెప్పినట్లు తెలిపారు. ‘ముగింపు ఇంకోలా ఉంటే బాగుండేదని RGV ఇటీవల అభిప్రాయపడ్డారు. కానీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఆ సినిమా ఎండింగ్‌ను మారుస్తానంటే ఇప్పుడు ఎవరూ ఒప్పుకోరని అన్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన కెరీర్‌లో సత్య టర్నింగ్ పాయింట్‌గా మారిందని JD చెప్పారు.

News October 31, 2025

వెనిజులాపై దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

image

వెనిజులాలోని మిలిటరీ స్థావరాలపై దాడులకు అమెరికా సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోల్స్ డ్రగ్ ముఠా ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పింది. కొన్ని రోజులు లేదా కొన్నిగంటల్లో అటాక్స్ జరగొచ్చని తెలిపింది. ఆ దేశాధ్యక్షుడు మదురో నేతృత్వంలోనే ఈ డ్రగ్ ముఠా నడుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఏటా 500 టన్నుల కొకైన్‌ను యూరప్, అమెరికన్ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతోంది.

News October 31, 2025

‘పహల్గామ్’ టెర్రరిస్టుల ఏరివేత.. 40 మందికి పురస్కారాలు

image

దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తు, ప్రత్యేక ఆపరేషన్లలో ప్రతిభ కనబర్చిన 1,466మంది ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత(ఆపరేషన్ మహాదేవ్)లో పాల్గొన్న 40మంది J&K పోలీసులు, CRPF సిబ్బంది ఉన్నారు. హోంశాఖ పరిధిలోని పురస్కారాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన కేంద్రం.. ఏటా ‘సర్దార్’ జయంతి రోజు(OCT31) దక్షతా పదక్ అవార్డులను ప్రకటిస్తోంది.

News October 31, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించింది. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని IMD తెలిపింది. కాగా ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో పొడివాతావరణం కనిపించింది. అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిశాయి.