News June 13, 2024

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టెట్‌లో అర్హత సాధించిన వారు డీఎస్సీకి చేసుకున్న దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెట్ మార్కులతో పాటు ఇతర వివరాలు ఎడిట్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిన్న టెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫెయిల్ అయిన వారు డిసెంబర్‌లో జరిగే టెట్‌కు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని వివరించింది.

News June 13, 2024

రోహిత్.. నీ లేఖ మనసును హత్తుకుంది: సీఎం చంద్రబాబు

image

తనకు శుభాకాంక్షలు చెబుతూ నటుడు నారా రోహిత్ నిన్న ట్విటర్‌లో పోస్ట్ చేసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు స్పందించారు. ‘ప్రియమైన నారా రోహిత్, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయి కాబట్టే ఎన్ని ఒడిదుడుకులలో అయినా నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. ప్రేమతో నీ పెదనాన్న’ అని సీఎం జవాబిచ్చారు.

News June 13, 2024

ఏంటీ స్కిల్ సెన్సెస్?

image

ఉన్నత విద్య అభ్యసించినా <<13433787>>నైపుణ్య<<>> లేమితో యువతకు అందుకు తగ్గ ఉద్యోగాలు రావడంలేదు. ఈ సమస్య పరిష్కారానికే కూటమి సర్కారు నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్) చేపట్టనుంది. ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయన్నది తేల్చనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ రంగానికి డిమాండ్ ఉందో స్టడీ చేసి ఆ ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించనుంది. నిరుద్యోగాన్ని తగ్గించడమే స్కిల్ సెన్సెస్ ప్రధాన లక్ష్యం.

News June 13, 2024

తొలి సంతకం ట్రెండ్ ఎప్పుడు మొదలైంది?

image

ఈరోజు AP CM చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. అయితే 2004 మే 14న LB స్టేడియంలో ఉమ్మడి AP CMగా YSR ప్రమాణ స్వీకారం చేసి ఆ వేదికపైనే రైతులకు ఫ్రీ కరెంట్‌పై తొలి సంతకం చేశారు. అప్పట్నుంచి ఈ ‘తొలి సంతకం’ ట్రెండ్ నడుస్తోంది. అంతకు ముందు ఇప్పుడున్నంత క్రేజ్ ఉండేది కాదు. కాగా మొన్న PM మోదీ ‘PM కిసాన్ నిధి’పై, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు.

News June 13, 2024

ఉత్కంఠ.. కాసేపట్లో మంత్రులకు శాఖలు!

image

AP: మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మంత్రుల శాఖలను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ శాఖలపై జోరుగా చర్చ జరుగుతోంది. వీటన్నింటికి కాసేపట్లో తెరపడనుంది.

News June 13, 2024

జబ్బు ఏంటో నాకు తెలియలేదు.. పనిమనిషి కనిపెట్టేసింది: డాక్టర్

image

తన 17ఏళ్ల అనుభవం కనిపెట్టలేని వ్యాధిని పనిమనిషి 10 సెకన్లలో గుర్తించిందని కేరళ వైద్యుడు డా.ఫిలిప్స్ తనకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నారు. ‘వైరల్ హెపటైటిస్ నుంచి డెంగీ వరకు అన్ని టెస్టులు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో మా పనిమనిషి వచ్చి అది ‘అంజామ్‌పనీ’ (5th డిసీజ్) అని, తన మనుమళ్లలో ఆ లక్షణాలు చూశానని చెప్పింది. వెంటనే పార్వోవైరస్ B19 టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 13, 2024

‘గొర్రెల’ స్కాం.. కేసు నమోదు చేసిన ఈడీ

image

TG: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం రూ.700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ కేసులో 10 మంది నిందితులను గుర్తించింది. దీంతో ఆ సంస్థ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా ఈ కేసు నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

News June 13, 2024

ఆ అధికారులను క్షమించను: అయ్యన్నపాత్రుడు

image

AP: మంత్రి పదవి రాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. వారిని చంద్రబాబు క్షమించినా తాను క్షమించనని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకోసం అనేక ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు.

News June 13, 2024

చైనా వల్లనే అపరిష్క‌ృతంగా బోర్డర్ సమస్య: అమెరికా

image

భారత్‌-చైనా సరిహద్దు సమస్య జిన్‌పింగ్ సర్కారు ధోరణి కారణంగానే అపరిష్కృతంగా ఉండిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కర్ట్ క్యాంప్‌బెల్ అన్నారు. ఇరు దేశాలూ ఎప్పటికైనా వాటి ఉమ్మడి ప్రయోజనాలను గుర్తిస్తాయని, ఆ రోజున కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో తాము కచ్చితంగా మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రాదేశిక అంశాల్లో చైనా పట్టువిడుపుతో ఉండాలని ఈ సందర్భంగా కర్ట్ సూచించారు.

News June 13, 2024

నెల రోజుల క్రితమే గాయమైంది: లావణ్య త్రిపాఠి

image

తన కాలికి నెల రోజుల క్రితమే గాయమైందని, ఇప్పటికీ తగ్గలేదని వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి చెప్పారు. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిమానులకు తెలిపారు. నిన్న కాలుకు గాయమైందని ఆమె <<13425501>>పోస్ట్<<>> చేయగా ఏమైందని మెగా ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. మెట్లు ఎక్కుతుండగా చీలమండ మడత పడిందని, తాజాగా వైద్యపరీక్షల్లో ఈ విషయం తేలినట్లు మెగా కోడలు పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు.