India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబైలో మే 1-4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)లో ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ అంశానికి PM మోదీ సారథ్యం వహించనున్నారు. వివిధ దేశాల్లోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్(M&E) రంగాల క్రియేటర్స్‌ను కనెక్ట్ చేసే వేదికే WAVES. సమ్మిట్‌లో పలు అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ నినాదంతో M&E హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
TG: ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది. కానీ 500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచులో సీఎస్కే మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా మ్యాచులు ఓడిపోతున్న నేపథ్యంలో యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. త్రిపాఠి లేదా విజయ్ శంకర్ స్థానంలో శివమ్ దూబే, పతిరణ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. పతిరణను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించుతారని టాక్.
హీరోయిన్ సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో కలిసి నిన్న ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు సమంతగానీ, అటు రాజ్‌గానీ స్పందించలేదు.
యూపీలో పెళ్లిపీటలపై తనకు కాబోయే భార్యకు బదులు ఆమె తల్లి ఉండడంతో వరుడు హతాశుడయ్యాడు. మీరట్‌కు చెందిన అజీం(22)కు శామలీ జిల్లాకు చెందిన మంతషా(21)తో వివాహం నిశ్చయమైంది. కానీ నిఖాలో మత గురువు వధువు పేరును ‘తాహిరా’ అని పలికాడు. అనుమానం వచ్చి ముసుగు తొలగించి చూడగా మంతషాకు బదులు భర్త చనిపోయిన ఆమె తల్లి తాహిరా (45) కనిపించింది. దీంతో మోసపోయానని గ్రహించి అజీం స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయిస్‌కు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవ్వొచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.
కాబోయే భార్య వేధింపులు తాళలేక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న ఘటన MHలో జరిగింది. నాసిక్‌కు చెందిన హరేరామ్(36), వారణాసి యువతి మోహినికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసి హరేరామ్ నిలదీశాడు. విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించింది. మానసిక ఒత్తిడికి లోనైన హరేరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి, ఆమె లవర్‌పై కేసు నమోదైంది.
డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా చేయాలనే కోరుతున్నామని తమిళనాడు CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలా చేస్తే సౌత్ స్టేట్స్‌కు నష్టం. వాయిదా వేసి సమన్యాయం జరిగేలా చూడాలంటున్నాం. హిందీ వల్ల నార్త్‌లో ఎన్నో రాష్ట్రాలు మాతృ భాషను కోల్పోయాయి. TNలో ఆ పరిస్థితి రానివ్వం’ అని వ్యాఖ్యానించారు.
దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. నడుము ఒంపులు ఎక్కువగా ఉన్న హీరోయిన్లను వారు ఇష్టపడతారని చెప్పారు. ‘నేను ముంబైలో పెరిగా కాబట్టి నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్‌సైట్:https://agnipathvayu.cdac.in/
Sorry, no posts matched your criteria.