News January 8, 2025

CT: అఫ్గాన్ మెంటార్‌గా యూనిస్ ఖాన్

image

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. గతంలో ఆయన అఫ్గాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేశారు. ఆయనకు PSL, అబుదాబి T10 లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్VSన్యూజిలాండ్ మ్యాచుతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

News January 8, 2025

ఆ సినిమా చేసినందుకు చింతిస్తున్నా: రామ్ చరణ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఏ మూవీ చేసినందుకు చింతిస్తున్నారో తెలిపారు. జంజీర్ సినిమాను రీమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. ఇందులో చరణ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 1973లో రిలీజైన ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్ నటించారు.

News January 8, 2025

పిల్లలొద్దు.. పెట్సే ముద్దంటున్నారు!

image

ఇండియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో మార్స్ పెట్‌కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్‌కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారంది.

News January 8, 2025

LRS పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్

image

TG: LRSపై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు?’ అని ప్రశ్నించారు.

News January 8, 2025

PMతో ప్రత్యేక‌హోదా ప్రకటన చేయించండి: షర్మిల

image

AP: విశాఖ వస్తున్న PM మోదీతో రాష్ట్రానికి ప్రత్యేక‌హోదా ప్రకటన చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ‘చంద్రబాబు గారూ మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక‌హోదా అన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని PMతో పలికించండి’ అని ట్వీట్ చేశారు.

News January 8, 2025

రైళ్లలో వెళ్లేవారు ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

image

పండుగ సందర్భంగా ప్రజలు రైళ్ల ద్వారా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ట్రైన్లలో వెళ్లేవారు తప్పనిసరిగా ఓ నంబర్ సేవ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 9881193322ను సేవ్ చేసుకొని వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. ఇందులో PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ షెడ్యూల్ & కోచ్ పొజిషన్, ముఖ్యంగా ట్రైన్‌లో ఎవరైనా ఇబ్బందిపెడితే రైల్ మదద్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు అధికారులు వస్తారు. SHARE IT

News January 8, 2025

వర్రా రవీంద్రారెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

image

AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు రెండ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. కడప జైలు నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కడప సైబర్ క్రైమ్ PSకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిపై జిల్లాలో 10, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులున్నాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్, అనితపై ఇతను సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదయ్యాయి.

News January 8, 2025

అభిమానుల కుటుంబాలకు రాంచరణ్ పరిహారం

image

‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డుప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రాంచరణ్ పరిహారం అందజేశారు. RTGS ద్వారా పేమెంట్ చేయగా, దానికి సంబంధించిన వివరాలను చెర్రీ ఫ్యాన్స్ బాధితుల తల్లిదండ్రులకు అందించారు. కాగా కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ రోడ్డుప్రమాదంలో మరణించారు. వీరికి పవన్, రాంచరణ్, దిల్ రాజు చెరో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

News January 8, 2025

కాంగ్రెస్‌కు షాక్: ఢిల్లీలో ఆప్‌కే INDIA మద్దతు

image

‘INDIA’లో కాంగ్రెస్‌పై అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ AAPకే మద్దతు ఇస్తున్నాయి. SP, SS UBT, TMC, RJD అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ప్రచారం చేయనున్నాయి. హస్తం పార్టీనెవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలే లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్యారీ దీదీ స్కీమ్‌నూ DK శివకుమార్ ప్రకటించారు. INC ఎలాగూ గెలవదనే కూటమి AAP వైపు మళ్లినట్టుంది.

News January 8, 2025

BITCOIN షాక్: 24 గంటల్లో Rs5 లక్షల నష్టం

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 6.29% తగ్గి $3.36Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ ఏకంగా 5.45% ఎరుపెక్కింది. $1,02,000 నుంచి $96,000కు తగ్గింది. అంటే $6000 (Rs 5.10L) నష్టపోయింది. మార్కెట్ విలువ $1.91Tకి తగ్గింది. ఇథీరియం 9.98% పడిపోయి $3,349 వద్ద కొనసాగుతోంది. XRP 4.16, BNB 4.59, SOL 8.95, DOGE 10.53, ADA 8.77, TRON 7.56, SUI 7.32, LINK 10.51% మేర ఎరుపెక్కాయి.