News June 11, 2024

పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి?

image

చంద్రబాబు కేబినెట్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన గౌరవం తగ్గకుండా మరెవరికీ ఈ పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. ఆయన ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. అటు టీడీపీకి 19, జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశముంది.

News June 11, 2024

నేపాల్ క్రికెటర్‌కు విండీస్ గుడ్ న్యూస్

image

నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు వెస్టిండీస్ శుభవార్త చెప్పింది. తమ ప్రాంతంలో నేపాల్ ఆడే మ్యాచుల్లో సందీప్ పాల్గొనవచ్చని విండీస్ ప్రకటించింది. దీంతో నేపాల్ ఆడబోయే చివరి రెండు మ్యాచుల్లో ఆయన బరిలోకి దిగనున్నారు. కాగా తొలుత ఎంపిక చేసిన నేపాల్ జట్టులో సందీప్‌కు చోటు దక్కింది. కానీ అత్యాచార ఆరోపణలు ఉన్నాయన్న కారణంతో ఆయనకు USA వీసా నిరాకరించింది. దీంతో నేపాల్ ఆడిన తొలి మ్యాచులో ఆయన పాల్గొనలేదు.

News June 11, 2024

ఆదాయపన్ను చట్టంలో చిన్న తప్పులకు తగ్గనున్న శిక్ష?

image

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లో మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చిరు తప్పిదాలకు శిక్షలను తగ్గించాలని కేంద్రం భావిస్తోందట. ఉదాహరణకు ప్రస్తుతం టీడీఎస్ చెల్లింపు ఆలస్యమైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో సంస్థల యాజమాన్యాలు సైతం చిక్కుల్లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చిరు తప్పిదాలకు శిక్షను జరిమానాకు పరిమితం చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందట.

News June 11, 2024

జులై 5న ‘మీర్జాపూర్’ సీజన్ 3 స్ట్రీమింగ్

image

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. జులై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఫస్ట్ సీజన్ 2018 నవంబర్‌లో రిలీజవగా రెండో సీజన్ 2020 అక్టోబర్‌లో స్ట్రీమింగ్ అయింది. ఈ రెండు సీజన్లు అత్యధిక మంది చూసిన ఇండియన్ సిరీస్‍ల్లో టాప్ ప్లేస్‍లో నిలిచాయి.

News June 11, 2024

రవితేజ, శ్రీలీల కొత్త సినిమా షురూ!

image

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబోలో మరో సినిమా ప్రారంభమైంది. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడనున్నట్లు టాక్. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. కాగా గతంలో రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’ సినిమాలో నటించారు. ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

News June 11, 2024

అంపైర్ వల్ల ఓడిన బంగ్లాదేశ్!

image

నిన్న అంపైర్ తప్పుడు నిర్ణయం, ICC రూల్స్ వల్ల బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికాపై 16.2వ బంతికి బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను అంపైర్ LBWగా ప్రకటించారు. ఆ బంతి ప్యాడ్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. బంగ్లా రివ్యూకు వెళ్లగా అది నాటౌట్ అని తేలింది. రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయం తీసుకోగానే అది డెడ్ బాల్‌గా మారుతుంది. దీంతో బౌండరీ వెళ్లినా ఫోర్ ఇవ్వలేదు. చివరికి బంగ్లా 4 రన్స్ తేడాతో ఓడింది.

News June 11, 2024

పేపర్ లీకేజీ ఆరోపణలపై సమాధానం చెప్పండి: SC

image

నీట్-యూజీ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)పై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీకైందని, పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని NTAకు నోటీసులు జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం జులై 8కి విచారణను వాయిదా వేసింది.

News June 11, 2024

మాంసాహారం తినడంలో మనమే టాప్!

image

మాంసాహారం తినడంలో దేశంలోనే TG తొలి, AP మూడో స్థానంలో నిలిచినట్లు NFHS తెలిపింది. TGలో 98.7 శాతం, APలో 98.25 శాతం మంది నాన్‌వెజ్ తింటున్నట్లు పేర్కొంది. మాంసం ధరలు కూడా ఇక్కడే అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ మాంసం రూ.500 నుంచి రూ.600 ఉండగా ఇక్కడ రూ.800 నుంచి రూ.1,000 వరకు ఉందని తెలిపింది. ప్రతీ వ్యక్తి మాంసం కోసం ఏడాదికి సగటున రూ.58 వేలు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.

News June 11, 2024

ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు: చంద్రబాబు

image

AP: తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన ‘నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడగుపెడతానని చెప్పా. ప్రజలు నా మాట నిలబెట్టారు. వారందరి సహకారంతో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా’ అని స్పష్టం చేశారు.

News June 11, 2024

NFL బాస్‌తో IPL బాస్!

image

NFL కమిషనర్ రోజర్ గూడెల్‌ను న్యూయార్క్‌లో బీసీసీఐ సెక్రటరీ జై షా కలిశారు. ఈ సందర్భంగా జై షా టీమ్ ఇండియా జెర్సీని గూడెల్‌కు కానుకగా ఇచ్చారు. టోర్నీ సంబంధిత విషయాలపై వీరు చర్చించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా NFL, IPL ప్రపంచంలోనే అత్యంత విలువైన టోర్నీలు. NFL బ్రాండ్ విలువ దాదాపు $18 బిలియన్లుగా, IPL వాల్యూ సుమారు $ 11 బిలియన్లుగా ఉంది.