India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత షట్లర్లు పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరిగారు. సింగపూర్‌కు చెందిన యెవో జియా మిన్ చేతిలో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోగా అనుపమ జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిడైరాతో 21-7, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. సింధు ఈ ఏడాది వరుసగా 7 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ కూడా దాటకపోవడం గమనార్హం.
అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న రెండు భారీ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు కెన్యా ప్రకటించింది. పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ నిర్మించేందుకు 700 మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు JKI విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను నిలిపివేస్తున్నామన్నారు. కాగా అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. ‘ఊహాగానాలెప్పుడూ ఊహాగానాలే. అవాస్తవాలే. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ధ్రువీకరణ కాని సమాచారాన్ని ప్రశ్నార్థకం పెట్టి రాసేస్తుంటారు. అది ఎవరి గురించైతే రాశారో వారి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో పట్టించుకోరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 38 మంది మరణించారు. 29 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పరాచినార్ నుంచి పెషావర్‌కు వెళ్తున్న రెండు వ్యాన్లపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
AP: అనంతపురం జిల్లా నార్పలలో ఒకే కుటుంబంలోని ముగ్గురు <<14669649>>ఉరేసుకొని<<>> ఆత్మహత్యకు పాల్పడ్డారు. నార్పలకు చెందిన కృష్ణ కిషోర్ (45) మెడికల్ స్టోర్ నిర్వహించేవారు. ఏ కష్టమొచ్చిందేమో కానీ భార్య శిరీష (35), 6 నెలల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇజ్రాయెల్ PM నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేత మహ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్-మస్రీపైనా ఈ వారెంట్ జారీ అయింది. గాజాలో యుద్ధం పేరిట సాధారణ పౌరులకు వీరు నష్టం కలిగించారని కోర్టు అభిప్రాయపడింది.
టీమ్ ఇండియా క్రికెటర్ చటేశ్వర్ పుజారా సరికొత్త అవతారం ఎత్తనున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆయన హిందీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో పుజారా పేరు చేర్చారు. ఇంగ్లిష్: నికోలస్, రవి శాస్త్రి, గవాస్కర్, మురళీ విజయ్, హెడెన్, అక్రమ్, ఆర్నాల్డ్. హిందీ: పుజారా, రవి శాస్త్రి, గవాస్కర్, మంజ్రేకర్, అక్రమ్, సప్రు, దీప్ దాస్ గుప్తా.
TG: నారాయణపేట జిల్లా మాగనూర్ ZP స్కూల్‌లో <<14664383>>ఫుడ్ పాయిజన్<<>> ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా, తాజాగా డీఈవో అబ్దుల్ ఘనీపై వేటు వేసింది. అలాగే అక్కడికి భోజనం సరఫరా చేసిన ఏజెన్సీని రద్దు చేసింది. ఆర్డీవో, ఎంపీడీవో, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై అడిషనల్ కలెక్టర్ సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా బానులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా శ్రీమంతులు ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నట్లు విడాకుల న్యాయవాది వందనా షా తెలిపారు. డబ్బు పంపకం, పిల్లల బాధ్యత, బోర్‌డమ్, బిగ్గర్ బెటర్ డీల్, వివాహేతర సంబంధాలు, ఈగో వంటి సమస్యల వల్లే విడిపోతారని చెప్పారు. ధనవంతులు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం బెటర్ అని ఆమె సూచించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న రాత్రి 7.02 గంటలకు ‘కిస్సిక్’ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు వేశారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న మూవీ విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.