News April 20, 2025

హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సాయం కోరిన బంగ్లా

image

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

News April 20, 2025

డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడదాం: చిరంజీవి

image

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీవర్క్స్‌లో జరిగిన నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయీ కలుపుదాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా శ్రమించాలి. వ్యసనాలకు బానిసలై తమ కలలను దూరం చేసుకుంటున్న యువతను రక్షిద్దాం’ అని ఆయన పేర్కొన్నారు.

News April 20, 2025

BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 20, 2025

IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

image

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News April 20, 2025

టూత్ పేస్ట్‌లో హానికర సీసం, పాదరసం: లీడ్ సేఫ్ మామా

image

కొన్ని ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు ‘లీడ్ సేఫ్ మామా’ సంస్థ అధ్యయనంలో తేలింది. 51 పేస్ట్ బ్రాండ్లను పరీక్షించగా వీటిలో చాలా బ్రాండ్లలో సీసం, ఆర్సెనిక్, మెర్క్యురీ, కాడ్మియం వంటి హానికర రసాయనాలు ఉన్నాయి. ఇవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కాగా ఈ బ్రాండ్లన్నీ తమ పేస్టుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నట్లు చెబుతున్నాయి.

News April 20, 2025

త్వరలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి

image

TGSRTCలో త్వరలో 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందులో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) 84, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) 114, డిపో మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 23, సెక్షన్ ఆఫీసర్(సివిల్) 11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ 7 పోస్టులున్నాయి.

News April 20, 2025

చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 20, 2025

స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. విజయవాడ, ఖమ్మంలో స్కిన్‌లెస్ రూ.220 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. గత వారం కిలో చికెన్ ధర రూ.260 వరకు అమ్మారు. అలాగే కరీంనగర్‌లో రూ.220-240 వరకు పలుకుతోంది. కాకినాడ, విశాఖపట్నంలోనూ రూ.220-240 వరకు ఉంది. చిత్తూరులో కిలో రూ.160-170గా ఉంది.

News April 20, 2025

దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: నడ్డా

image

సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ <<16152959>>నిశికాంత్ దూబే వ్యాఖ్యలను<<>> ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటితో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కామెంట్లను బీజేపీ ఎప్పుడూ అంగీకరించదని, మద్దతివ్వదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టును తాము గౌరవిస్తామని ట్వీట్ చేశారు.

News April 20, 2025

చంద్రబాబుకు మోదీ, రేవంత్, చిరు శుభాకాంక్షలు

image

‘నా మిత్రుడు, CM చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని PM మోదీ పోస్ట్ చేశారు. ‘నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ AP అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని TG సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ‘కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలి’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.