News June 11, 2024

పేపర్ లీకేజీ ఆరోపణలపై సమాధానం చెప్పండి: SC

image

నీట్-యూజీ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)పై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీకైందని, పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని NTAకు నోటీసులు జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం జులై 8కి విచారణను వాయిదా వేసింది.

News June 11, 2024

మాంసాహారం తినడంలో మనమే టాప్!

image

మాంసాహారం తినడంలో దేశంలోనే TG తొలి, AP మూడో స్థానంలో నిలిచినట్లు NFHS తెలిపింది. TGలో 98.7 శాతం, APలో 98.25 శాతం మంది నాన్‌వెజ్ తింటున్నట్లు పేర్కొంది. మాంసం ధరలు కూడా ఇక్కడే అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ మాంసం రూ.500 నుంచి రూ.600 ఉండగా ఇక్కడ రూ.800 నుంచి రూ.1,000 వరకు ఉందని తెలిపింది. ప్రతీ వ్యక్తి మాంసం కోసం ఏడాదికి సగటున రూ.58 వేలు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.

News June 11, 2024

ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు: చంద్రబాబు

image

AP: తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన ‘నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడగుపెడతానని చెప్పా. ప్రజలు నా మాట నిలబెట్టారు. వారందరి సహకారంతో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా’ అని స్పష్టం చేశారు.

News June 11, 2024

NFL బాస్‌తో IPL బాస్!

image

NFL కమిషనర్ రోజర్ గూడెల్‌ను న్యూయార్క్‌లో బీసీసీఐ సెక్రటరీ జై షా కలిశారు. ఈ సందర్భంగా జై షా టీమ్ ఇండియా జెర్సీని గూడెల్‌కు కానుకగా ఇచ్చారు. టోర్నీ సంబంధిత విషయాలపై వీరు చర్చించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా NFL, IPL ప్రపంచంలోనే అత్యంత విలువైన టోర్నీలు. NFL బ్రాండ్ విలువ దాదాపు $18 బిలియన్లుగా, IPL వాల్యూ సుమారు $ 11 బిలియన్లుగా ఉంది.

News June 11, 2024

BREAKING: చంద్రబాబు వార్నింగ్

image

AP: తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి’ అని CBN స్పష్టం చేశారు.

News June 11, 2024

ఏపీ అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చింది: చంద్రబాబు

image

ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. ‘నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను. కానీ ఈసారి ప్రత్యేకం. ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. పవిత్రమైన బాధ్యత ఇచ్చారు. ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కేంద్రం సహాయం అవసరమని బీజేపీ నాయకత్వాన్ని కోరాం. పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు’ అని చంద్రబాబు తెలిపారు.

News June 11, 2024

పెరగనున్న ‘కల్కి’ టికెట్ ధరలు?

image

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘కల్కి’ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ధరల పెంపు తర్వాత తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ ధర రూ.413, సింగిల్ స్ర్కీన్‌లో రూ.236గా ఉండనుంది. అలాగే ఏపీలో టికెట్ ధర కనిష్ఠంగా రూ.206.5 నుంచి గరిష్ఠంగా రూ.354వరకు ఉంటుందట.

News June 11, 2024

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

image

TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,211 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల నీరు ఉంది. మరికొద్ది రోజుల్లో జలాశయం పూర్తిస్థాయిలో నిండనుంది.

News June 11, 2024

1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేవు: CBN

image

AP: రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజలు తమకు అప్పగించారని చంద్రబాబు అన్నారు. ‘1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేవు. ఇప్పుడు 175కు 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. 93% స్ట్రైకింగ్ రేటు ఉంది. దేశ చరిత్రలోనే ఇది అరుదైన విజయం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కి 5 గెలిచాం. నూటికి నూరు శాతం మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా పని చేశారు’ అని CBN అభినందించారు.

News June 11, 2024

మణిపుర్‌ పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: RSS చీఫ్

image

మణిపుర్‌లో ఏడాదిగా హింసాత్మక వాతావరణం కొనసాగుతుండటంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పదేళ్లుగా ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. కానీ గత ఏడాది మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. దీనిని ఎవరు పట్టించుకుంటారు? తక్షణమే ఈ పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది’ అని RSS కార్యక్రమంలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో నేతలు హుందాగా వ్యవహరించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.