News June 11, 2024

BIG ALERT: ఇవాళ భారీ వర్షాలు

image

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ TGలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. APలోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News June 11, 2024

ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమలకు చంద్రబాబు

image

AP: సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, బాలకృష్ణ తదితరులు రాత్రికి అక్కడే బస చేసి 13న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత CBN తొలిసారి తిరుమలకు రానుండటంతో స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

News June 11, 2024

నేడు EAPCET ఫలితాలు

image

AP: నేడు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్&ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో సెట్ ఛైర్మన్ ప్రసాదరాజు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 3.39 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. WAY2NEWSలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సులభంగా రిజల్ట్స్ చూసుకోవచ్చు.

News June 11, 2024

1, 2, 3, 4.. సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విజయాలు

image

T20WCలో థ్రిల్లింగ్ విక్టరీలు సాధించడం సౌతాఫ్రికాకు పరిపాటిగా మారింది. 5 పరుగుల కంటే తక్కువ మార్జిన్లతో ఆ జట్టు నాలుగుసార్లు గెలిచింది. 2009లో న్యూజిలాండ్‌పై ఒక రన్, 2014లో అదే జట్టుపై 2, అదే ఏడాది ఇంగ్లండ్‌పై 3, ఈసారి బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో ప్రొటీస్ <<13417885>>విజయం<<>> సాధించింది. మరే ఇతర జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు.

News June 11, 2024

మహారాష్ట్రలో ‘కేంద్ర కేబినెట్’ చిచ్చు

image

మహారాష్ట్రలో 7 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ కేంద్రంలో ఒకటే సహాయమంత్రి పదవి దక్కడంపై శివసేన(శిండే) గుర్రుగా ఉంది. కనీసం కేబినెట్ హోదా మంత్రి పదవి రాకపోవడంపై నిరాశగా ఉన్నామని ఆ పార్టీ ఎంపీ శ్రీరంగ్ తెలిపారు. తక్కువ సీట్లు గెలిచిన చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి, జితిన్ రాం మాంఝీకి కేబినెట్ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఇక ఒక సీటే గెలిచిన NCP(అజిత్ పవార్)కి సహాయమంత్రి పదవి ఆఫర్ చేయగా తిరస్కరించింది.

News June 11, 2024

డిపెండెంట్‌ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

image

TG: సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో కార్మికుడు దివ్యాంగుడైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా డిపెండెంట్ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది.

News June 11, 2024

నేడు టీడీఎల్పీ సమావేశం

image

AP: విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్‌తోపాటు జనసేన, బీజేపీ MLAలు కూడా పాల్గొంటారు. తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

News June 11, 2024

మీ తల్లులు, సోదరీమణులను మేమే రక్షించాం: హర్బజన్

image

‘అర్ధరాత్రి 12 గంటలకు ఏ సిక్కుకూ బౌలింగ్ ఇవ్వరాదు’ అని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలకు హర్బజన్ Xలో కౌంటరిచ్చారు. ‘నీ చెత్త నోరు విప్పడానికి ముందు సిక్కుల చరిత్ర తెలుసుకో. అర్ధరాత్రి 12 గంటలకు ఆక్రమణదారులు మీ తల్లులు, సోదరీమణులను అపహరించినప్పుడు మేమే రక్షించాం. కృతజ్ఞతతో ఉండండి’ అని పోస్టు చేశారు. అర్ష్‌దీప్‌ను ఉద్దేశించి సిక్కులను నమ్మొద్దనే అర్థంలో అక్మల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 11, 2024

ఇవాళ ఎడ్‌సెట్ ఫలితాలు

image

తెలంగాణ ఎడ్‌సెట్ ఫ‌లితాలను ఇవాళ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ లింబాద్రి విడుదల చేయనున్నారు. మే 23న జరిగిన ఈ పరీక్షకు 33,789 మంది దరఖాస్తు చేసుకోగా, 87 శాతం మంది హాజరయ్యారు. సెష‌న్‌-1లో 14,633 మంది, సెష‌న్-2లో 14,830 మంది అభ్య‌ర్థులు పరీక్ష రాశారు. https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

News June 11, 2024

టెన్త్‌లో 10 GPA సాధిస్తే ఇంటర్‌లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్

image

TG: విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెన్త్‌లో 10 GPA సాధించిన విద్యార్థులకు మంచి కాలేజీల్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టెన్త్ టాపర్లకు పురస్కారాల అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.