News June 10, 2024

మోదీకి నవాజ్ షరీఫ్ విషెస్

image

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. ‘మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇటీవల ఎన్నికల్లో మీ పార్టీ విజయం ప్రజల్లో మీ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దాం. దక్షిణాసియాలోని రెండు బిలియన్ల ప్రజల భవిష్యత్తును రూపొందించే అవకాశాన్ని పొందుదాం’ అని Xలో పేర్కొన్నారు.

News June 10, 2024

చంద్రబాబు విక్టరీతో ఆంధ్రా కంపెనీల జోరు!

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో ఆంధ్రా కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. గత నాలుగు సెషన్లలో KCP స్టాక్స్ 50%, అమరరాజా 32%, ఆంధ్రా షుగర్స్ 21%, అవంతీ ఫీడ్స్ 28%, లారస్ ల్యాబ్ 10%, నెల్‌కాస్ట్ అడ్వాన్సింగ్ 13% వృద్ధి చెందాయి. మరోవైపు కల్లం టెక్స్‌టైల్స్ 19%, విరాట్ క్రేన్ ఇండస్ట్రీస్ 23%, ఆంధ్రా సిమెంట్స్ 24%, క్రేన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 40%, ఆంధ్రా పెట్రోకెమికల్ షేర్లు 32% పెరిగాయి.

News June 10, 2024

మనిషి మెదడుతో తొలి ‘లివింగ్ కంప్యూటర్’!

image

స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మనిషి మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను కలిపి ప్రపంచంలోనే తొలి ‘లివింగ్ కంప్యూటర్’ను రూపొందించారు. దీనికి ‘బ్రెయినోవేర్’ అనే పేరు పెట్టారు. డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే ఇది 10లక్షల రెట్లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టవచ్చని, సాధారణ కంప్యూటర్‌ చిప్‌ లాగే ఇది సిగ్నల్స్‌ను పంపిస్తుందన్నారు.

News June 10, 2024

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

image

ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక జరుగుతున్న తొలి మంత్రివర్గ భేటీ ఇది. మంత్రివర్గాన్ని ఉద్దేశించి ప్రస్తుతం మోదీ మాట్లాడుతున్నట్లు సమాచారం.

News June 10, 2024

లీకు వీరులకు ‘కల్కి’ టీమ్ వార్నింగ్

image

భారీ బడ్జెట్‌తో ‘కల్కి’ సినిమాను తెరకెక్కిస్తుండటంతో లీకు వీరులకు వైజయంతి మూవీస్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ / లీక్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని వెల్లడించింది. సినిమాలోని సీన్స్, ఫొటోలు, ఫుటేజీ ఎవరూ షేర్ చేయొద్దని హెచ్చరించింది. అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కల్కి ట్రైలర్ రిలీజ్ కానుంది.

News June 10, 2024

రేపు ఎడ్‌సెట్ ఫలితాలు

image

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మే 23న జరిగిన ఈ పరీక్షకు 33,789 మంది దరఖాస్తు చేసుకున్నారు. 87శాతం మంది హాజరయ్యారు.

News June 10, 2024

ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తాం: పట్టాభి

image

AP: ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ నేత పట్టాభిరామ్ అన్నారు. తాము హింసను ప్రేరేపించమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారని మండిపడ్డారు. కూటమి పార్టీలన్నీ ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాయన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేశ్ రెడ్‌బుక్, ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.

News June 10, 2024

మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హవా!

image

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మే నెలలో 83.42% పెరిగి రూ.34,697కోట్లకు చేరినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) వెల్లడించింది. మే నెలలో నికరంగా రూ.30వేల కోట్లకుపైగా పెట్టుబడులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా సెక్టోరల్ & థిమేటిక్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.19,213.43 కోట్ల కొనుగోళ్లు రికార్డ్ అయ్యాయి. SIPల ద్వారా మేలో రూ.20,904కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

News June 10, 2024

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రాత్రి 7 గంటల్లోపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, భువనగిరిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News June 10, 2024

త్వరలో టీచర్ పోస్టుల భర్తీ: సీఎం

image

TG:DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో టెన్త్ టాపర్లకు పురస్కారాలు అందించారు. ‘కొంతకాలంగా ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అవుతున్నాయి. ఇప్పటి IAS, IPSలు, CMలు, కేంద్రమంత్రులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదివారు. పిల్లలను చేర్పించకపోతే స్కూలు మూతపడుతుందని బడిబాట ద్వారా పేరెంట్స్‌కు టీచర్లు అవగాహన కల్పించాలి’ అని ఆయన కోరారు.