News October 31, 2025

MGB, NDAలకు కీలకంగా మారిన ‘బిహార్ వార్’

image

బిహార్‌లో ప్రధాన కూటములు పోటాపోటీ హామీలు గుప్పించాయి. ‘తేజస్వీ ప్రాణ్’ పేరిట MGB ‘సంపూర్ణ బిహార్ కా సంపూర్ణ పరివర్తన్’ నినాదంతో స్టేట్ రూపురేఖలు మారుస్తామంది. గత ప్రభుత్వ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పింది. NDA ‘సంకల్ప్ పాత్ర్’ పేరుతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలు అక్కడి పాలనా పగ్గాల కోసమే కాక హిందీ బెల్టులో పాగా వేసేందుకు కీలకం కావడమే కారణం.

News October 31, 2025

ఇతిహాసాలు క్విజ్ – 52 సమాధానాలు

image

1. జనకుని భార్య పేరు ‘సునయన’.
2. మహాభారతంలో రాధేయుడు ‘కృష్ణుడు’.
3. దత్తాత్రేయుడికి ‘24’ మంది గురువులు ఉన్నారు.
4. దేవతలకు వైద్యుడు ‘ధన్వంతరి’.
5. సముద్ర మథనంలో లక్ష్మీదేవికి ముందు పుట్టిన ఆమె అక్క పేరు ‘అలక్ష్మి’. ఆమెనే ‘జ్యేష్టా దేవి’ అని కూడా అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 31, 2025

కోడలి జీతంలో మామకు రూ.20వేలు: రాజస్థాన్ హైకోర్టు

image

కుటుంబ పోషణ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న కోడలికి రాజస్థాన్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భర్త చనిపోవడంతో అతడి ఉద్యోగం భార్యకు లభించింది. అయితే ఆమె తమ బాగోగులు చూసుకోవట్లేదని మామ భగవాన్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కారుణ్య నియామకం మొత్తం కుటుంబానికి చెందుతుందని కోడలు శశి కుమారి జీతం నుంచి ప్రతినెలా రూ.20వేలు తీసి సింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి.

News October 31, 2025

త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 29న జరగాల్సి ఉండగా.. తుఫానుతో వాయిదా పడిందన్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో 41 వేల ఇళ్లను మంజూరు చేశామని, రూరల్ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది.

News October 31, 2025

కిడ్నాప్ నుంచి త్రుటిలో తప్పించుకున్నా: నటి

image

ముంబైలో 20 మంది <<18153268>>కిడ్నాప్<<>>, నిందితుడు రోహిత్ ఆర్య ఎన్‌కౌంటర్ ఘటనపై మరాఠీ నటి రుచితా విజయ్ స్పందించారు. ‘రోహిత్ ఓ ప్రొడ్యూసర్‌గా నాకు పరిచయం. ఓ హోస్టేజ్ చిత్రం గురించి మాట్లాడటానికి OCT 28న కలవాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దు చేసుకున్నా. మరుసటి రోజు అతని గురించి వినగానే షాకయ్యా. రోహిత్ బారిన పడకుండా దేవుడే కాపాడాడు. కొత్త వ్యక్తులతో పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.

News October 31, 2025

రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా Dy.CM భట్టి క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా OCT నెలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్ R&Bకి రూ.320 కోట్లు విడుదల చేశారు. దీంతో రూ.10లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ కానున్నాయి.

News October 31, 2025

2,162 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

RRC నార్త్ వెస్ట్రర్న్ రైల్వేలో 2,162 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in

News October 31, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 31, 2025

BREAKING: భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.