India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.rites.com

‘ఓం నమ:శివాయ’ అనే 5 అక్షరాలతో మనం శివుణ్ని కొలుస్తాం. ఈ పంచాక్షరీ మంత్రమే పంచభూతాలు కూడా. ఈ పంచభూతాల ఆధారంగానే మన శరీరం నిర్మితమైంది. దీనికి సూచనగా దేవుడు మన చేతికి, కాలికి సహజంగానే ఐదు వేళ్లను ఏర్పరిచాడు! ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇదొకటి. మనిషి ఐదు వేళ్లను కలిగి ఉండటం, ఐదు భూతాలతో తయారవడం… ఇదంతా సృష్టికర్త మనకిచ్చిన దివ్య సంకేతం. మన శరీరమే పరమేశ్వరుని సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అద్భుత రహస్యం! <<-se>>#SIVA<<>>

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మరో శీష్ మహల్ ఉందని BJP ఆరోపించింది. ఢిల్లీ మహల్‌ను ఖాళీ చేశాక చండీగఢ్‌లో 7 స్టార్ బంగ్లాను కేజ్రీవాల్ నిర్మించారని ట్వీట్ చేసింది. 2 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిందని చెప్పింది. ఓ ఏరియల్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీలో CM నివాసాన్ని ₹45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్‌గా మార్చుకున్నారని గతంలో కేజ్రీవాల్‌పై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.

AP: మాజీ MLA సివేరి సోమా కుమారుడు సురేశ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. జోన్-1లో డిప్యూటీ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 3(b) కింద ప్రత్యేక పరిస్థితుల్లో రిక్రూట్‌మెంట్‌లో ఈ స్థానాన్ని భర్తీ చేసినట్లు పేర్కొంది. 2018 SEP 28న నక్సల్స్ కాల్పుల్లో సివేరి సోమా ప్రాణాలు కోల్పోయారు.

ఒవేరియన్ క్యాన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు నిపుణులు. విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గితే అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా, హార్మోన్ చికిత్స తీసుకున్నా దీని ముప్పు పెరుగుతుంది.

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్‌కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.