News June 9, 2024

ఓటమెరుగని మోదీ(2/2)

image

దీంతో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే 2002 DECలో జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో BJP విజయం సాధించడంతో మోదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2007, 12లోనూ ముఖ్యమంత్రి అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ అధిష్ఠానం నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంతో సీఎం పదవికి రాజీనామా చేసి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.

News June 9, 2024

ఓటమెరుగని మోదీ(1/2)

image

నరేంద్ర మోదీ మొదట RSSలో పలు హోదాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 1987లో బీజేపీలో చేరి కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టారు. 1995లో బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు. 2001లో గుజరాత్ CM కేశుభాయ్ పటేల్ రాజీనామాతో అనూహ్యంగా మోదీని హైకమాండ్ సీఎం చేసింది. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాకపోగా ఉపఎన్నికలో పోటీచేసి గెలిచారు. అదే సమయంలో గుజరాత్ అల్లర్ల విషయంలో ఆయనపై విమర్శలు రావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.

News June 9, 2024

కేంద్ర మంత్రివర్గంలోకి జేపీ నడ్డా?

image

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రి పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు నడ్డా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నడ్డాకు మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News June 9, 2024

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఈటల?

image

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధిష్ఠానం నుంచి ఆయనకు సంకేతాలు అందినట్లు సమాచారం. రేపు ఆయన అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ కిషన్ రెడ్డి కాసేపట్లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర బాధ్యతలు ఈటలకు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.

News June 9, 2024

మహిళను మింగేసిన కొండచిలువ

image

ఇండోనేషియాలో ఓ మహిళ అసాధారణ స్థితిలో మృతి చెందింది. సౌత్ సులావెసి ప్రావిన్స్‌లోని కలెమ్‌పాంగ్ గ్రామానికి చెందిన ఫరీదాను కొండచిలువ మింగేసింది. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఓ చోట కదలలేని స్థితిలో ఉన్న ఓ భారీ కొండచిలువను గుర్తించారు. అనుమానంతో వారు దాని కడుపును చీల్చి చూడటంతో ఫరీదా మృతి చెందిన స్థితిలో కనిపించింది. గతంలోనూ ముగ్గురు ఇలా కొండచిలువ బారిన పడి చనిపోయారు.

News June 9, 2024

స్పీకర్ పదవిపై స్పందించేందుకు నిరాకరించిన పురందీశ్వరి

image

AP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ‘మీకు లోక్‌సభ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట కదా?’ అన్న ప్రశ్నకు మౌనంతోనే సమాధానమిచ్చారు. రిపోర్టర్ మరోసారి అడగ్గా చేతులు జోడించి నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారు. మరోవైపు ఏపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

News June 9, 2024

అప్పుడలా.. ఇప్పుడిలా.. కంగనాపై విమర్శలు

image

ఎంపీ కంగనాపై ఎయిర్ పోర్టులో <<13392690>>దాడి<<>> సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కంగనాను చెంప దెబ్బ కొట్టడం తప్పని కొందరు వాదిస్తుండగా మరో చర్చ తెరపైకి వచ్చింది. గతంలో ఆస్కార్ ఈవెంట్లో భార్యను ఎగతాళి చేశాడని యాంకర్‌ను విల్ స్మిత్ కొట్టడాన్ని కంగనా సమర్థించారు. తల్లి, సోదరిపై జోకులు వేస్తే తాను కూడా అలాగే చేస్తానని కంగనా అన్నారు. అలా అయితే కానిస్టేబుల్ చేసిందాంట్లో తప్పేమీ లేదని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

News June 9, 2024

BALAYYA: హీరోగా.. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్!

image

టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయంతో హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ సాధించారు. రెండు రంగాల్లో బాలయ్య అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

News June 9, 2024

కేంద్రంలో TDP మంత్రుల శాఖలు ఇవేనా?

image

AP: కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు) శాఖలపై ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిలో ఒకరికి ఐటీశాఖ, మరొకరికి ఉక్కు, గనులశాఖ దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ మొదటి నుంచి పట్టుబడుతోన్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ జేడీయూకు కేటాయించనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News June 9, 2024

కీలక పోరుకు ముందు స్టార్ ప్లేయర్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్

image

మరికొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా పాకిస్థాన్ కీలక ప్లేయర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. కుడి పక్కటెముక గాయంతో అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్‌ వసిమ్‌ ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యారని పాక్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపారు. భారత్‌తో మ్యాచ్‌లో బ్యాటర్ ఆజం ఖాన్ స్థానంలో ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ను పాక్ తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది.