News June 9, 2024

రేపు ‘NBK 109’ నుంచి ఫైరింగ్ ట్రీట్?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న మూవీ నుంచి ఫైరింగ్ ట్రీట్ రానున్నట్లు తెలుస్తోంది. రేపు బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలవుతున్నట్లు సమాచారం. బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 10న మూవీ విడుదల కానున్నట్లు టాక్.

News June 9, 2024

కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి!

image

కేంద్ర మంత్రివర్గంలోకి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు అనూహ్యంగా చోటు దక్కింది. 1988లో బీజేపీలో కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1992-95లో ప.గో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. 2008 నుంచి 2014 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గానూ సేవలందించారు. కూటమి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

News June 9, 2024

మోదీ 3.0: స్మృతి, అనురాగ్‌కు నిరాశే?

image

మోదీ 3.0 కేబినెట్‌లో కొందరు కీలక నేతలు లేనట్లు తెలుస్తోంది. మోదీ 2.0లో కీలక మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ వంటి నేతలకు ఈ సారి చోటు దక్కలేదని సమాచారం. అమేథీ నుంచి పోటీ చేసిన స్మృతి ఓడిపోయారు. హమిర్‌పుర్ నుంచి బరిలోకి దిగిన అనురాగ్ విజయం సాధించారు. కాగా వీరిద్దరితో పాటు మరికొందరికి మోదీ 3.0 కేబినెట్‌లో బెర్త్ దక్కలేదని చర్చ నడుస్తోంది. అయితే మరికాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.

News June 9, 2024

బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక పురోగతి

image

బంగ్లా MP అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ కాలువలో మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌లో అరెస్టయిన నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని గుర్తించారు. ఈ ఎముకలు MPవేనని భావిస్తున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపించనున్నారు. అంతకుముందు MP హత్య జరిగిన ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో మాంసపు ముద్దను పోలీసులు గుర్తించి DNA పరీక్షలకు పంపారు.

News June 9, 2024

పనుల్ని సమయానికి పూర్తి చేయండి: మోదీ

image

కేబినెట్‌లో చోటు దక్కిన ఎంపీలకు ప్రధాని మోదీ తేనేటి విందు ఏర్పాటు చేశారు. పరిపాలనపై దృష్టి పెట్టాలని, పనుల్ని సమయానికి పూర్తి చేయాలని వారికి సూచించారు. నేడు ప్రధానిగా మోదీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈసారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనా. హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ బీజేపీ వద్దే కొనసాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News June 9, 2024

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే..

image

సంఘ్ కార్యకర్త అయిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 14లో అంబర్‌పేట్ నుంచి MLAగా గెలిచారు. 2019లో SEC MPగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

News June 9, 2024

ఒకప్పటి కార్పొరేటర్.. నేడు సెంట్రల్ మినిస్టర్!

image

BJPలో కింది స్థాయి నుంచి వచ్చిన నేతలను కేంద్రమంత్రి పదవులు వరించాయి. ఇందులో తెలంగాణ నుంచి MP బండి సంజయ్ ఉన్నారు. ఓ కార్పొరేటర్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత MPగా గెలిచిన ఆయన ఏడాదిలోపే BJP రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తెలంగాణలో BJP బలోపేతానికి తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం BJP నేషనల్ సెక్రటరీగా ఉన్న ఆయన రెండోసారి కరీంనగర్ MPగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సాధించారు.

News June 9, 2024

T20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు

image

T20 WC 2024లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచులో 366 స్కోర్(AUS 201, ENG 165) నమోదైంది. ఒక్క ప్లేయర్ కూడా 50+ స్కోర్ చేయకుండా అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచుగా ఇది రికార్డు సృష్టించింది. అంతకుముందు 2010లో SAvsNZ మ్యాచులో 327 స్కోర్ నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును AUSvsENG మ్యాచ్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచులో హెడ్ 34, వార్నర్ 39, మార్ష్ 35, స్టోయినిస్ 30, బట్లర్ 42, సాల్ట్ 35 రన్స్ చేశారు.

News June 9, 2024

సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నా: కిషన్ రెడ్డి

image

TG: ప్రధాని మోదీ 3.O కేబినెట్‌లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డికి బెర్త్ ఖాయమైంది. ఈ రోజు సా.7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. ‘సికింద్రాబాద్ ప్రజలు, మోదీ ఆశీస్సులతో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని, జేపీ నడ్డా, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News June 9, 2024

మూడోసారి ఎంపీ.. మూడు భాషల్లో ప్రావీణ్యం

image

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించిన ఆయన బీటెక్, ఎంబీఏ పూర్తిచేశారు. వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఆయన సొంతం. బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను రామ్మోహన్ వివాహం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.