News June 9, 2024

T20 WCలో పాక్‌పై భారత్‌దే పైచేయి

image

T20 WC చరిత్రలో భారత్, పాక్ ఇప్పటివరకు 7సార్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా 6 మ్యాచుల్లో గెలవగా, పాక్ ఒక్క మ్యాచులోనే నెగ్గింది. 2007లో గ్రూప్ మ్యాచ్, ఫైనల్‌తో పాటు 2012, 2014, 2016, 2022లో PAKపై IND విజయం సాధించింది. 2021లో భారత్‌పై పాక్ గెలిచింది. ప్రస్తుత ఫామ్ చూసుకుంటే నేటి మ్యాచ్‌లో INDకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంది. రా.8కి ప్రారంభమయ్యే ఈ మ్యాచును star sports ఛానల్, hotstarలో చూడవచ్చు.

News June 9, 2024

ముగిసిన గ్రూప్-1 పరీక్ష.. వాటిపైనే ఎక్కువ ప్రశ్నలు!

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఉ.10:30కి ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. కొంతమంది అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఈ పరీక్షకు 4.03లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

News June 9, 2024

దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా రామ్మోహన్: TDP

image

దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా TDP MP రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించనున్నారు. ఈ క్రమంలో ‘కేంద్ర మంత్రిగా బీసీ నేత, మన సిక్కోలు బిడ్డ, కింజరాపు రామ్మోహన్ నాయుడు’ అంటూ TDP ట్వీట్ చేసింది. ‘ఉత్తరాంధ్రకు మరోసారి చంద్రన్న పెద్దపీట వేశారు. రామ్మోహన్ 36 ఏళ్లకే దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రి కానున్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఆయనకు ఉంది. బీటెక్, MBA చేసిన విద్యావంతుడు’ అని పేర్కొంది.

News June 9, 2024

మోదీ 3.O సర్కారుపై సైకత శిల్పం

image

ప్రముఖ సైకత శిల్పి, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ తన కళా ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరనున్న వేళ అభినందనలు తెలుపుతూ ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు. పూరీ తీరంలో తీర్చిదిద్దిన ఈ కళాత్మక చిత్రం ఆకట్టుకుంటోంది. దీనికి ‘మోదీ 3.O.. వికసిత్ భారత్’ అని క్యాప్షన్ ఇచ్చారు.

News June 9, 2024

ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో CBN పాల్గొననున్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు మృతితో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నిన్న ఢిల్లీ నుంచి బాబు HYD వచ్చారు. అటు టీడీపీ తరఫున కేంద్రమంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న రామ్మోహన్, పెమ్మసానికి ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.

News June 9, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరిగేది అప్పుడేనా?

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉందని CRICBUZZ తెలిపింది. పలు దేశాల్లో జరిగే లీగ్స్ తేదీలను సవరించి ఈ 20 రోజుల్లోనే CT ఫైనల్ షెడ్యూల్‌ను రూపొందిస్తారని పేర్కొంది. 8 టీమ్స్ పాల్గొనే ఈ 50 ఓవర్ల టోర్నీ ఈసారి PAKలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ ఆడేందుకు IND నిరాకరిస్తోంది. దీంతో వేదికపై స్పష్టత రాలేదు. చివరగా 2017లో ఈ టోర్నీ జరగగా ఫైనల్‌లో INDపై PAK గెలిచింది.

News June 9, 2024

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి BIG UPDATE

image

ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని పలు థియేటర్లను ఎంపిక చేసింది. ‘కల్కి 2898AD’ ప్రపంచంలోకి స్వాగతం అంటూ ఈ మేరకు పోస్టర్లను పంచుకుంది. థియేటర్ల వివరాలు పైన గ్యాలరీలో చూడగలరు. కాగా ఈ నెల 27న ఈ మూవీ రిలీజ్ కానుంది.

News June 9, 2024

మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ఖర్గే

image

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. బీజేపీ పెద్దలు ఆయనకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలు, ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు, పొరుగు దేశాధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు 7000 మంది హాజరుకానున్నట్లు సమాచారం.

News June 9, 2024

మోదీ 3.0లో మంత్రులు వీరేనా? (1/2)

image

అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జయంత్ చౌదరి, జితన్ రామ్ మాంఝీ, రామ్‌నాథ్ ఠాకూర్, చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, ప్రతాపరావు జాదవ్, రక్షా ఖడ్సే, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, కిరణ్ రిజుజు, ఇంద్రజిత్ సింగ్, శంతను ఠాకూర్, మన్సుఖ్ మాండవీయ, అశ్విని వైష్ణవ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్.

News June 9, 2024

మోదీ 3.0లో మంత్రులు వీరేనా? (2/2)

image

శోభా కరంద్లాజే, రవ్‌నీత్ సింగ్ బిట్టు, సర్బానంద సోనోవాల్, అన్నపూర్ణా దేవి, జితిన్ ప్రసాద్, మనోహర్‌లాల్ ఖట్టర్, హర్ష్ మల్హోత్రా, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, అజయ్ తమ్తా, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, సావిత్రి ఠాకూర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, మురళీధర్ మోహన్.