News September 30, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.

News September 30, 2024

పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదు: లోకేశ్

image

AP: స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. సాల్డ్ ప్రాజెక్టు ద్వారా HMలు, SGTలకు సమగ్ర శిక్షణ, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు నెలాఖరులోగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించాలని, పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లలో హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News September 30, 2024

ఆ విద్యార్థి కోసం విచ‌క్ష‌ణాధికారాన్ని వాడిన సుప్రీంకోర్టు

image

ఓ విద్యార్థి కోసం సుప్రీంకోర్టు ఆర్టిక‌ల్‌ 142 ద్వారా త‌న విచ‌క్ష‌ణాధికారాన్ని ఉపయోగించింది. IIT ధ‌న్‌బాద్‌లో అడ్మిష‌న్ పొంద‌డానికి ₹17,500 కట్టలేకపోవడంతో UPకి చెందిన అతుల్ కుమార్ సీటు కోల్పోయారు. 3 నెల‌లపాటు పలు వేదికలను ఆశ్రయించినా ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగలేదు. చివరికి SCని ఆశ్రయించగా ప్ర‌తిభావంతుడైన ఆ విద్యార్థికి సీటు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. విద్యార్థికి All The Best చెప్పింది.

News September 30, 2024

నిజం తెలిసి దాచి ఉంటే అది నిజమైన పాపం: TDP

image

AP: తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీపడదు, రాజకీయం చేయదని TDP ట్వీట్ చేసింది. ‘నెయ్యి కల్తీ జరిగిందని NDDB లాంటి పేరున్న సంస్థ రిపోర్ట్ చూడగానే CM ప్రజల ముందు ఉంచారు. నిజం తెలిసి దాచి ఉంచితే అది నిజమైన పాపం. వాస్తవాలు తేల్చడానికే సిట్ ఏర్పాటు చేశారు. అనేక చర్యలతో ప్రజల్లో అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లడ్డూ నాణ్యతలో మార్పు వచ్చిందని ప్రజలు అంటున్నారు’ అని పేర్కొంది.

News September 30, 2024

గ్రాడ్యుయేట్ MLC ఓట్ల నమోదుకు నోటిఫికేషన్

image

AP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల (గ్రాడ్యుయేట్) పట్టభద్రుల స్థానం పరిధిలో ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఫారం 18 ద్వారా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న MLC ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

News September 30, 2024

సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు

image

ముడా కేసులో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్దరామ‌య్య‌ సహా పలువురిపై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించినా సిద్దరామ‌య్య‌కు ఊర‌ట ద‌క్కలేదు. దీంతో లోకాయుక్తలో ఆయనపై FIR నమోదైన విషయం తెలిసిందే. మైసూరు అర్బ‌న్ డెవ‌లప్మెంట్ అథారిటీలో సీఎం సతీమణికి భూకేటాయింపులపై వివాదం చెలరేగింది.

News September 30, 2024

రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్

image

TG: మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికిపైగా అన్నదాతలకు మాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మాఫీ కాని మరో 1.50లక్షల మందిని నిర్ధారించారు. మొత్తం 5 లక్షలకుపైగా అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే వారి అకౌంట్లలో రూ.5వేల కోట్లను జమ చేయనున్నారు.

News September 30, 2024

జైస్వాల్.. ది టీమ్ఇండియా ఫ్యూచర్

image

టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ యశస్వీ జైస్వాల్ బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో 72 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుంచి సిక్సులు, ఫోర్లతో అదరగొట్టారు. జైస్వాల్ ఇప్పటివరకు 11 టెస్టు మ్యాచులు ఆడగా 19 ఇన్నింగ్సుల్లో 1166 రన్స్ చేశారు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు చేశారు. మొత్తం 131 ఫోర్లు, 31 సిక్సులు బాదడం విశేషం.

News September 30, 2024

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికులకు ఆఫర్లు పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. అటు అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ఛార్జీలు నామ మాత్రంగానే ఉంటాయంది.

News September 30, 2024

ఎల్లుండి రజినీ ‘వేట్టయన్’ ట్రైలర్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ట్రైలర్ అక్టోబర్ 2న రానుంది. లైకా ప్రొడక్షన్స్ తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రివీల్ పోస్టర్‌ను విడుదల చేసింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు. మంజూ వారియర్ హీరోయిన్‌గా అలరించనున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.