News June 9, 2024

ప్రజ్వల్ రేవణ్ణ గర్ల్‌ఫ్రెండ్‌కు నోటీసులు

image

కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, JDS మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గర్ల్‌ఫ్రెండ్‌కు పోలీసులు నోటీసులు పంపారు. ఏప్రిల్ 26న దేశం విడిచి రేవణ్ణ జర్మనీ పారిపోయారు. అక్కడ ప్రజ్వల్‌కు గర్ల్‌ప్రెండ్ సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ప్రజ్వల్‌తో పాటు ఆమె తల్లి భవానీని శనివారం అధికారులు ఐదు గంటల పాటు విచారించారు.

News June 9, 2024

రేపటి నుంచి పీజీఈసెట్

image

TG: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగనున్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా ఫార్మసీకి 7,376 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. పరీక్ష రాసే సమయంలో టెక్నికల్ సమస్య వస్తే మరో కంప్యూటర్‌లో పరీక్ష రాసే అవకాశం ఇస్తామన్నారు. నష్టపోయిన సమయాన్ని కూడా పొందవచ్చని తెలిపారు.

News June 9, 2024

ఇవాళ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

image

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఇవాళ ఉ.10 గంటలకు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది హాజరవగా, వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40వేలమంది ఉన్నట్లు అంచనా. ఓపెన్ కేటగిరీలో 6వేల లోపు ర్యాంకు వస్తే సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది 23 ఐఐటీల్లో 17,385 సీట్లు భర్తీ చేయగా, ఈసారి వాటి సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది.
వెబ్‌సైట్: https://jeeadv.ac.in/

News June 9, 2024

1,526 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CRPF, BSF, ITBP, CISF, SSB, AR)లో 1,526 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ASI, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, క్లర్క్ పోస్టులున్నాయి. ఇంటర్‌, షార్ట్ హ్యాండ్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, PET&PST, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>https://rectt.bsf.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

News June 9, 2024

బాలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ?

image

తెలుగులో యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారట. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం నటిస్తున్న ‘దిలేర్’ మూవీలో ఆమె నటిస్తారని సమాచారం. మేకర్స్ ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని కునాల్ దేశ్ ముఖ్ తెరకెక్కిస్తున్నారు.

News June 9, 2024

గనుల శాఖ, ఏపీఎండీసీ కార్యాలయాలు సీజ్

image

AP: విజయవాడలోని గనుల శాఖ, ఖనిజాభివృద్ధి సంస్థల కార్యాలయాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. APMDC ఇన్‌ఛార్జి MD వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆయా కార్యాలయాలకు తాళాలు వేశారు. లీజుల కేటాయింపుల్లో అక్రమాలు, ఇసుక విక్రయాల్లో దోపిడీ, బీచ్ శాండ్ అంశాల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారనే ఆరోపణలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా దస్త్రాలు, హార్డ్ కాపీలు బయటకు వెళ్లనీకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

News June 9, 2024

ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News June 9, 2024

వీసీలు హెడ్‌క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశాలు

image

AP: ప్రభుత్వ యూనివర్సిటీల ఉపకులపతులు హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, ఎస్పీలను సంప్రదించి పరిష్కరించుకోవాలంది. శాఖాపరమైన సమస్యలకు ఉన్నత విద్యాశాఖను సంప్రదించాలంది. ఇటు ఆంధ్ర వర్సిటీలో కీలక దస్త్రాలు మాయం అని పత్రికల్లో వచ్చిన వార్తలను అవాస్తవమని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.

News June 9, 2024

తెలంగాణకు కొత్త సీఎస్?

image

TG: రాష్ట్రంలో CS సహా IAS, IPS అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. CS శాంతికుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు డీజీపీ రవిగుప్తాను కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన్ను కూడా బదిలీ చేయాలని భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి ఉన్నారు. వారంలో బదిలీల జీవో రావొచ్చు.

News June 9, 2024

నేడు దాయాదుల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్

image

T20WCలో భాగంగా నేడు ఇండియా, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రా.8కు మ్యాచ్ ప్రారంభం కానుంది. US చేతిలో ఓడి పాక్ నిరాశలో ఉండగా, ఐర్లాండ్‌పై గెలుపుతో భారత్ ఉత్సాహంగా ఉంది. WCలో దాయాదిపై ఉన్న గెలుపు రికార్డును కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. అక్షర్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వస్తారని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.